అవకాశాల కోసం కొత్త యాంగిల్ చూపుతోంది

0

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా ఆ తర్వాత తెలుగులో మంచి ఆఫర్లను దక్కించుకుంది. కెరీర్ ఆరంభంలో కాస్త బొద్దుగా ఉంది అంటూ టాక్ రావడంతో కష్టపడి బరువు తగ్గింది. ఈమెకు అడపా దడపా చిన్న హీరోలతో సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. కొన్ని సక్సెస్ లను కూడా దక్కించుకుంది. కాని ఇప్పటి వరకు ఈ అమ్మడికి స్టార్ హీరోలతో అవకాశం రావడం లేదు. పైగా ఈమద్య ఈమెకు చిన్న హీరోల సరసన నటించే అవకాశాలు కూడా కనిపించడం లేదు. తెలుగులో ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమా ఏంటీ అంటే వెంటనే చెప్పలేని పరిస్థితి. తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తున్న ఈమె తెలుగుకు గుడ్ బై చెప్పే టైం వచ్చిందేమో అనిపిస్తుంది.

ఇలాంటి సమయంలో తన హాట్ వీడియోలు మరియు ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న ముద్దుగుమ్మ రాశిఖన్నా తాజాగా కొత్త యాంగిల్ చూపించే ప్రయత్నం చేసింది. చీర కట్టి ట్రెడీషనల్ ఇండియన్ గృహిణిగా కనిపించింది. తాను అల్ట్రా మోడ్రన్గా మాత్రమే కాకుండా ఇలా అందమైన మహిళగా గృహిణిగా కూడా కనిపిస్తాను. తనకు అలాంటి ఆఫర్లు అయినా ఇవ్వండి అన్నట్లుగా ఈ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ కొత్త యాంగిల్ చూసి అయినా ఫిల్మ్ మేకర్స్ రాశిఖన్నాకు ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.