మళ్లీ మద్యలోనే ‘రాధేశ్యామ్’ వెనక్కు రానున్నాడా?

0

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం ‘రాధేశ్యామ్’ కోసం ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాహో విడుదలకు ముందు ఈ సినిమా పట్టాలెక్కింది. కాని అనేక కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఈ ఏడాది ఆరంభంలో చిత్ర యూనిట్ సభ్యులు యూరప్ లో చిత్రీకరణ కోసం వెళ్లారు. అక్కడ చిత్రీకరణ లో ఉన్న సమయంలో కరోనా వల్ల అర్థాంతరంగా షూటింగ్ ను ఆపేసి రావాల్సి వచ్చింది. దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ రాధేశ్యామ్ యూనిట్ ఇటలీ వెళ్లారు.

రెండు వారాలుగా అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. మరో రెండు వారాల పాటు అక్కడ చిత్రకరణ చేయాల్సి ఉంది. అయితే ఇటలీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. థియేటర్లు మూసి వేయడంతో పాటు పబ్లిక్ ప్లస్ ల్లో సంచారంపై ఆంక్షలు విధించారు. దాంతో రాధేశ్యామ్ షూటింగ్ కు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అంటున్నారు. మళ్లీ అక్కడి షెడ్యూల్ పూర్తి చేయకుండానే తిరిగి రావచ్చు అంటున్నారు. కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించి అతి త్వరలోనే ప్రభాస్ టీం ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.