పవన్ ను 3 నెలల టైం కోరిన క్రిష్

0

పవన్ కళ్యాణ్ ఈమద్య వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ వరుసగా సినిమాలకు ఓకే చెప్పాడు. పవన్ ఓకే చెప్పిన ప్రాజెక్ట్ లు దాదాపు ఆరు ఉన్నాయి. అధికారికంగా ప్రకటన రానివి మరికొన్ని ఉన్నాయి. కనుక వీటన్నింటిని రాబోయే రెండేళ్లలో పూర్తి చేయాలంటే తక్కువ సమయంలో ఒక్కో సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. అందుకే ఒక్కో సినిమాకు రెండు మూడు నెలల కంటే ఎక్కువ సమయం కేటాయించేది లేదు అంటూ పవన్ ఇప్పటికే దర్శక నిర్మాతలకు చెప్పాడట.

పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అతి త్వరలోనే వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. పవన్ వకీల్ సాబ్ సినిమా పూర్తి అయిన వెంటనే క్రిష్ దర్శకత్వంలో విరూపాక్ష మూవీని చేయాల్సి ఉంది. ఆ సినిమా గత ఏడాదిలోనే ప్రారంభం అయ్యింది. కాని కరోనా కారణంగా సినిమా పూర్తి కాలేదు. కరోనా వచ్చి ఉండకుంటే సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేది.

విరూపాక్ష సినిమాను మోగలాయిల కాలం నాటి కథతో క్రిష్ తెరకెక్కిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గజ దొంగ పాత్రలో కనిపించబోతున్నాడట. మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసేందుకు గాను పక్కా ప్రాణాళికను క్రిష్ వేశాడు. డిసెంబర్ చివరి నుండి మొదలు పెట్టి మార్చి చివరి వరకు సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నాడట. పూర్తిగా రామోజీ ఫిల్మ్ సిటీ మరియు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో షూట్ చేయాలని భావిస్తున్నారు.