పాత అప్పు కట్టి కొత్త సినిమా రిలీజ్ చేస్తున్నారా?

0

మహమ్మారీ ఎన్నిటికో చెక్ పెట్టేసింది. ముఖ్యంగా సినీఇండస్ట్రీకి పెద్ద గుదిబండలా మారడంతో అది నిర్మాతలకు డైజెస్ట్ కావడం లేదు. ఇప్పుడు హీరో విశాల్ కి మహమ్మారీ పంచ్ మామూలుగా లేదని తెలుస్తోంది. పాత అప్పులు ఓవైపు సతాయిస్తుంటే.. కొత్త సినిమా రిలీజ్ తిప్పలు మరోవైపు అన్న చందంగా మారిందన్న గుసగుసలు ఫిలింనగర్ సర్కిల్స్ లో వేడెక్కిస్తున్నాయి.

ఇంతకీ మ్యాటరేమిటి? అంటే.. గత సినిమా అప్పుల భారం తీర్చేస్తే కానీ ఇప్పటి మూవీని రిలీజ్ చేయలేక విశాల్ నానా విధాలా సతమతమవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవైపు మహమ్మారీ వల్ల థియేటర్లు తెరవని సన్నివేశం ఉంటే మరోవైపు భారీగా అప్పులు చెల్లించి రిలీజ్ చేయాల్సిన వైనం అతడికి ఇబ్బందికరంగా పరిణమించిందట.

దాదాపు 4.5 కోట్ల అప్పు కట్టి `చక్ర` సినిమాకు లైన్ క్లియర్ చేసుకున్నారని తెలుస్తోంది. గతేడాది విశాల్- తమన్నా కాంబోలో వచ్చిన `యాక్షన్` సినిమా ఫ్లాప్ అవ్వడంతో దీనికి సంబంధించిన సెటిల్మెంట్ వ్యవహరాల్లో విశాల్ `యాక్షన్` నిర్మాతలకి దాదాపుగా 8 కోట్లు కట్టాల్సి ఉందిట. అయితే దీని పై విశాల్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో యాక్షన్ నిర్మాతలు కోర్టుకెక్కారు. దీంతో విశాల్ కోర్టు ఆర్టర్ మేరకు 4 కోట్లు కట్టి ఇప్పుడు `చక్ర` సినిమాను విడుదల చేయించుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ చక్ర సినిమాకు రిటర్న్స్ రావాలంటే థియేటర్స్ తెరిచి ఉండాలి. ఆడియెన్స్ ఫుల్ అటెండెన్స్ ఉండాలి. అది ఇప్పుడప్పుడే జరిగేలా కనిపించడం లేదు. మరి విశాల్ చక్రం ఎలా తిరుగుతుందో చూడాలి అంటూ ఫిలిం సర్కిల్స్ లో చర్చ సాగుతోంది.