Templates by BIGtheme NET
Home >> Cinema News >> YRK ఫస్ట్ లుక్: గగుర్పొడిచే విరోచిత పోరాటాలతో యువరాజ్

YRK ఫస్ట్ లుక్: గగుర్పొడిచే విరోచిత పోరాటాలతో యువరాజ్


సౌత్ లో పాన్ ఇండియా సినిమాల వెల్లువ ఒక మేలిమి మలుపు అనే చెప్పాలి. హీరోలంతా ఒకరితో ఒకరు పోటీపడుతూ బాలీవుడ్ ని కొట్టేసే సినిమాలు చేయాలన్న పంతంతో ఉన్నారు. బాహుబలి సిరీస్ తో తొలి అడుగు వేయడం అటుపై వరుసగా సౌత్ లోనూ భారీ పాన్ ఇండియా చిత్రాల్ని ప్రకటిస్తుండడం హీట్ పెంచేస్తోంది.

టాలీవుడ్ లో బాహుబలి.. శాండల్వుడ్ లో కేజీఎఫ్ సంచలనాలను మరిచిపోలేం. ఇదే కోవలో ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో మరో భారీ పాన్ ఇండియా సినిమా అంతకంతకు హీట్ పెంచుతోంది. యువరాజ్ కుమార్ అన్న ఆసక్తికర టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో విరోచిత పోరాటాలు గగుర్పాటుకు గురి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా #YRK ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ మైండ్ బ్లాక్ చేస్తోంది.

లెజెండరీ కన్నడ నటుడు కంఠీరవ డా.రాజ్ కుమార్ మనవడు యువ రణధీర కంఠీరవ ఈ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. అతడి ఎంట్రీ కన్నడ ఇండస్ట్రీలో మునుపెన్నడూ ఏ హీరోకి లేనంత గ్రాండ్ గా ఉండబోతోందని తాజా లుక్ చెబుతోంది. స్నీక్ పీక్ #YR01 పేరుతో రిలీజ్ చేసిన వీడియో ఒక రేంజులోనే ఉంది మరి. అల్ట్రా రిచ్ విజువల్స్ తో టైటిల్ కి తగ్గట్టే రాజుల కాలంనాటి కోటలు ప్రాకారాలతో అదరగొట్టారు. మాస్క్ వేసిన ముసుగు దొంగల్ని కంఠీరవ ఇరగ్గొడుతున్న తీరు గగుర్పొడుస్తోంది. పర్ఫెక్ట్ మార్షల్ ఆర్ట్స్ కి సూటయ్యే ఫిట్ బాడీతో రాజ్ కుమార్ మనవడు అదరగొడుతున్నాడు.

అయితే 1960లో రిలీజైన రణధీర కంఠీరవ క్లాసిక్ మూవీకి యువరాజ్ కుమార్ మూవీకి ఏమాత్రం సంబంధం లేనిదిగా కనిపిస్తోంది. యువ రాజ్ కుమార్ ఇంట్రడక్షన్ అదిరింది. ఈ మూవీకి పునీత్ రుద్రాంగ్ దర్శకత్వం వహిస్తున్నారు.