ఆదిపురుష్ కోసం మరో బాలీవుడ్ స్టార్

0

ప్రభాస్ హిందీలో చేయబోతున్న మొదటి సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను వచ్చే ఏడాది ఆరంభంలో షురూ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆది పురుష్ లో రాముడి పాత్రను ప్రభాస్ లంకేష్ పాత్రను సైఫ్ అలీ ఖాన్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆతర్వాత పలు ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. కీలక పాత్రలో అజయ్ దేవగన్ ను నటింపజేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కాని అజయ్ దేవగన్ ఆ వార్తలను కొట్టి పారేశాడు. అలాంటి చర్చలు ఏమీ జరగలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఇప్పుడు అజయ్ దేవగన్ భార్య కాజోల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాజోల్ హీరోయిన్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. అయితే ఈమద్య కాలంలో సినిమాల సంఖ్య చాలా తగ్గించింది. పాత్రకు ప్రాముఖ్యత ఉన్న కథలను సినిమాలను ఎంపిక చేసుకుని మరీ నటిస్తుంది. ఆదిపురుష్ లోని ఒక పాత్రను కాజోల్ కు చెప్పగా ఆమె వెంటనే ఓకే చెప్పిందట. ఆ విషయం అతి త్వరలోనే అధికారికంగా చిత్ర యూనిట్ సభ్యుల నుండి ప్రకటన రాబోతుంది.

ఆదిపురుష్ సినిమా పూర్తిగా బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. అందుకే ప్రభాస్ కాకుండా మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణులు అంతా కూడా బాలీవుడ్ వారే ఉంటారని తెలుస్తోంది. బాలీవుడ్ మూవీగా పూర్తిగా బాలీవుడ్ వారితో తెరకెక్కించడం వల్ల అక్కడ మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం. ఇక సౌత్ లో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తో ఇక్కడ కూడా వసూళ్లు ఓ రేంజ్ లో వస్తాయి. కనుక ఆది పురుష్ మూవీ బాలీవుడ్ స్టారింగ్ తో అదిరిపోయే వసూళ్లను రాబట్టుకోవడం ఖాయం అంటున్నారు.