‘ఆదిపురుష్’లో మహేష్ హీరోయిన్

0

ప్రభాస్ మొదటి బాలీవుడ్ డైరెక్టర్ మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రామాయణ ఇతివృత్తంతో రూపొందబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. రాముడి పాత్రలో ప్రభాస్ నటించనుండగా రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నాడు. ఇక సీత పాత్రలో ఎవరు నటిస్తారా అంటూ గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దర్శకుడు సీత పాత్రకు ఒక హీరోయిన్ ను ఎంపిక చేశాడు. కాని అధికారికంగా మాత్రం ఆ విషయాన్ని వెళ్లడించేందుకు గాను మంచి సందర్బం కోసం వెయిట్ చేస్తున్నాడు. బాలీవుడ్ మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం కృతి సనన్ ను ఎంపిక చేశాడట.

తెలుగు ప్రేక్షకులకు ‘1 నేనొక్కడినే’ సినిమాతో సుపరిచితం అయిన ఆమె మొదటి సినిమానే మహేష్ తో చేసినా లక్ కలిసి రాకపోవడంతో బాలీవుడ్ కు పరిమితం అయ్యింది. అక్కడ లక్ కలిసి రావడంతో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఆమె అయితే ప్రభాస్ కు అన్ని విధాలుగా సూట్ అవుతుందని.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయం కనుక రెండు విధాలుగా అక్కడ ఇక్కడ హీరోయిన్ విషయంలో పాజిటివ్ రియాక్షన్ వస్తుందని దర్శకుడు భావిస్తున్నాడట. ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా ఆదిపురుష్ లో సీత పాత్రలో నటించబోతున్నది కృతి సనన్ అంటూ అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.