బాలీవుడ్ లో స్పోర్ట్ లుక్ తో బోల్డ్ బ్యూటీస్ గా పాపులరయ్యారు మలైకా అరోరాఖాన్.. దిశా పటానీ.. ఆ ఇద్దరి బాటలోనే నేటితరం నటవారసురాళ్లు జాన్వీ.. అనన్య.. సారా అలీఖాన్ లాంటి భామలు వేడెక్కించే స్పోర్ట్స్ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో మంటలు పుట్టించాయి.
ఇప్పుడు సీకే బ్యూటీకే చెమటలు పట్టేలా.. ఫ్యాషనిస్టా మలైకాకే గుబులు పుట్టేలా చేస్తోంది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. తాజాగా స్పోర్ట్స్ బ్రాలో లావణ్య ఇచ్చిన ఫోజులు కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. లావణ్య నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ ఇదన్న ప్రశంసలు దక్కుతున్నాయి.
స్పోర్ట్స్ బ్రా .. నీలిరంగు డెనిమ్ జీన్స్ లో అగ్గి రాజేసింది లావణ్యం. నిజానికి ఈ లుక్ తో టాలీవుడ్ దర్శకనిర్మాతలకు గ్లాం షో పరంగా సరికొత్త గోల్స్ ని ఫిక్స్ చేసిందన్న టాక్ మొదలైంది. ఇక కెరీర్ సంగతి చూస్తే.. లావణ్య నటించిన A1 ఎక్స్ప్రెస్ ఈ నెలలో విడుదలవుతోంది. ఇందులో తను హాకీ ప్లేయర్ గా కనిపిస్తుంది. ఎ1 ఎక్స్ ప్రెస్ ట్రైలర్ లో లిప్ లాక్ తో లావణ్య హీట్ పెంచిన సంగతి తెలిసిందే. మరోవైపు కార్తికేయ సరసన చావు కబురు చల్లగా అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ మూవీ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది.