Templates by BIGtheme NET
Home >> Cinema News >> మహేష్ బాబు ఫొటో ఇవ్వండయ్యా..!

మహేష్ బాబు ఫొటో ఇవ్వండయ్యా..!


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ చేశాడు. చిత్రీకరణ స్టార్ట్ చేసిన వారం రోజుల్లోనే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశాడంటే మహేష్ అండ్ టీమ్ పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నట్లు అర్థం అవుతోంది. తనకు కలిసొచ్చిన సంక్రాంతి పండుగ సీజన్ లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించేశారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ని కూడా వదిలారు. ఇందులో మహేష్ ఫేస్ కనిపించకుండా చేతిలో తాళాలు పట్టుకుని నిలబడి ఉన్నాడు. అయితే టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి మహేష్ లుక్ కనిపించకుండా పోస్టర్స్ రిలీజ్ చేయడం పట్ల సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

‘సర్కారు వారి పాట’ టైటిల్ అనౌన్స్ మెంట్ నాడు చెవి రింగు చూపించి.. మహేష్ బర్త్ డే నాడు రూపాయి కాయిన్ ని వెగరేయడం చూపించి.. ఇప్పుడు చేతిలో ఉన్న తాళాల గుత్తి చూపించి దర్శకనిర్మాతలు మోసం చేశారంటూ మహేశ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న మైత్రీ మూవీస్ వారు.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విధేయుడిగా ఉండే పరాశురామ్ కావాలనే తమ హీరో ఫోటోని రివీల్ చేయడం లేదనే వాదనలు కూడా మహేశ్ ఫ్యాన్స్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. మహేష్ లుక్ బయటకు రిలీజ్ చేస్తే ‘పుష్ప’ న్యూలుక్ అంతా పక్కనపెట్టేసి అంతా ‘సర్కారు వారి పాట’ వైపుకి వెళ్లిపోతారనే ఉద్దేశ్యంతో కావాలనే ఇలా చేసారని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అంతేగాక మహేష్ న్యూ లుక్ యాడ్ ల రూపంలో టీవీలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంది. అలాంటప్పుడు మహేశ్ లుక్ దాచేయడానికి ఏముందనేది మహేష్ ఫ్యాన్స్ వాదన. మరి చిత్ర యూనిట్ మహేష్ ఫోటోని ఎందుకు ఇవ్వడం లేదో..!