Templates by BIGtheme NET
Home >> Cinema News >> వకీల్ సాబ్ కూడా రిలీజ్ డేట్ చెప్పేసాడు

వకీల్ సాబ్ కూడా రిలీజ్ డేట్ చెప్పేసాడు


వరసగా తెలుగు సినిమా నిర్మాతలు అందరూ తమ తమ సినిమాల విడుదల తేదీలను ఖరారు చేసుకుంటూ వస్తోన్న విషయం తెల్సిందే. ఫిబ్రవరి నుండి మొదలుపెట్టి అక్టోబర్ వరకూ సినిమాల రిలీజ్ డేట్లు కన్ఫర్మ్ అవుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు రిలీజ్ కు కన్ఫర్మ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు వకీల్ సాబ్ కూడా రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ సినిమా పింక్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడు కాగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో అంజలి, నివేతా థామస్, అనన్యలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. వకీల్ సాబ్ ను ఏప్రిల్ 9న సమ్మర్ స్పెషల్ గా విడుదల చేస్తున్నారు.