మంచు మోహన్ బాబు ఇంట అనూహ్యంగా ఆ ఛేంజ్

0

విఘ్న వినాయకుని ఆశీస్సులు అందుకునేందుకు టాలీవుడ్ ప్రముఖ కుటుంబాలు ఎప్పుడూ ముందుంటాయి. మెగా కుటుంబం సహా ఇతర బడా ఫ్యామిలీస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులందరితో కలిసి పండుగలను జరుపుకునేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. వినాయక చతుర్థికి ఆయన కుటుంబీకుల్ని ఓచోట చేర్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఇంట్లో పూజలు చేసేటప్పుడు.. వినాయక చతుర్ధి ప్రాశస్త్యాన్ని కుటుంబ సభ్యులకు సన్నిహితులు వివరించే అలవాటు ఉంది.

కానీ ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా వేడుకలు జరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆయన స్నేహితులను ఎవరినీ ఆహ్వానించలేదు. కేవలం కుటుంబ సభ్యులు పూజకు హాజరయ్యారు. తాజాగా రిలీజైన ఛాయాచిత్రంలో కుటుంబం సాంప్రదాయ దుస్తులలో గణపతికి ప్రార్థనలు చేస్తూ కనిపించారు.

మోహన్ బాబు కెరీర్ సంగతి చూస్తే.. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన `ఆకాశం నీ హద్దురా`లో కీలక పాత్రలో కనిపించనున్నారు. తదుపరి ఆయన తన ఆస్థాన రచయితకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో `సన్ ఆఫ్ ఇండియా` అనే దేశభక్తి ఎంటర్ టైనర్ ని చేయనున్నారు. మణిరత్నం దర్శకత్వంలోని హిస్టారికల్ మూవీలో కీలక పాత్రను పోషించనున్న సంగతి తెలిసిందే.