Templates by BIGtheme NET
Home >> Cinema News >> షాకింగ్: సీక్రెట్ గా మెహ్రీన్ నిశ్చితార్థం?

షాకింగ్: సీక్రెట్ గా మెహ్రీన్ నిశ్చితార్థం?


ఆల్ ఆఫ్ సడెన్..! గుట్టు చప్పుడు కాకుండా అందాల యువనాయిక మెహ్రీన్ నిశ్చితార్థం జరిగిపోవడం ఆ ఫోటోలు వెబ్ లో వైరల్ అవ్వడంతో అభిమానులు షాక్ కి గురవుతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మూడు ముడుల బంధంలోకి అడుగు పెట్టేస్తుంటే ..హనీ ఫ్యాన్స్ సడెన్ షాక్ కి గురయ్యారు. కొద్దిరోజుల క్రితతం మెహ్రీన్ కి నిశ్చితార్థం అంటూ కొన్ని వెబ్ లలో ప్రచారమైనా దానిపై అభిమానులకు ఇప్పటికీ స్పష్ఠమైన అవగాహన రాలేదు. అందుకే అంతా ఆశ్చర్యంలో ఉన్నారు.

ఓవైపు ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3లో నటిస్తున్న మెహ్రీన్ పెళ్లికి సంబంధించి కనీసం గుసగుసలు అయినా టాలీవుడ్ లో వినిపించలేదు. కానీ సడెన్ గా భవ్య బిష్ణోయ్ తో జైపూర్ లో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది. వివాహానికి చాలా ముందే తన ఇంట ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జైపూర్ లోనే ఈ వివాహం జరగనుందని తెలుస్తోంది.

మెహ్రీన్ సోదరుడు గుర్ఫతే సింగ్ పిర్జదా స్వయంగా నిశ్చితార్థ ఉత్సవం నుంచి కొన్ని ఫోటోల్ని అభిమానులకు షేర్ చేసారు. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. సాంప్రదాయబద్ధంగా సాగే ఈ వివాహానికి సౌత్ నుంచి ఎవరెవరు హాజరవుతారు? అన్నది తెలియాల్సి ఉంది.

ఎఫ్ 2తో మెహ్రీన్ కెరీర్ కి జోష్ నింపిన అనీల్ రావిపూడికి.. అలాగే కోస్టార్లు వరుణ్ తేజ్.. విక్టరీ వెంకటేష్ కి ఈ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం అందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన స్నేహితులు తమన్నా- కయాని ప్రియదర్శన్- రాహుల్ వైద్య తదితరులు ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. వీరంతా మెహ్రీన్ పెళ్లికి అటెండవుతారని భావిస్తున్నారు.