రవితేజ కంటే ముందు సుధీర్ బాబుతో సినిమా…?

0

‘ప్రేమ కథా చిత్రమ్’ ‘భలే భలే మగాడివోయ్’ ‘మహానుభావుడు’ ‘ప్రతిరోజూ పండగే’ వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ మారుతి.. మాస్ మహారాజా రవితేజతో ఓ సినిమా చేయనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మారుతి రవితేజకు కథ వినిపించారని.. కాన్సెప్ట్ కొత్తగా వుండటంతో వెంటనే ఓకే చేశారని.. రవితేజ లాయర్ గా కనిపించనున్నాడని.. జీఏ 2 – యూవీ క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని చెప్పుకున్నారు. అయితే ఫిలిం సర్కిల్స్ లో ఇప్పుడు మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

డైరెక్టర్ మారుతి రవితేజతో సినిమా కంటే ముందు మరో మీడియం బడ్జెట్ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట. వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు ఈ సినిమాలో హీరోగా నటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ని ఎవరు నిర్మిస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో పాటు ‘ఆహా’ కోసం ఓ వెబ్ సిరీస్ ని అందించనున్నారు మారుతి. దీనికి సంబంధించిన విషయాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఇదిలా ఉండగా సుధీర్ బాబు ఇప్పటికే ‘యాత్ర’ ప్రొడ్యూసర్స్ తో ఓ సినిమా.. ‘పలాస’ డైరెక్టర్ కరుణ కుమార్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడని తెలిసింది.