Templates by BIGtheme NET
Home >> Cinema News >> నెపోటిజం పై అవన్నీ చేతకాని కుళ్ళుబోతు మాటలు : నాగబాబు

నెపోటిజం పై అవన్నీ చేతకాని కుళ్ళుబోతు మాటలు : నాగబాబు


సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా బంధుప్రీతి(నెపోటిజం) పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువ ఉంటుందని.. దీని కారణంగా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన వారికి అవకాశాలు రాకుండా చేస్తుంటారని.. నటవారసులకి మాత్రం టాలెంట్ తో సంబంధం లేకుండా ఛాన్సెస్ ఇస్తుంటారంటూ సినీ ప్రముఖులు బాహాటంగా కామెంట్స్ చేస్తున్నాయి. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అయినప్పటికీ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ సభ్యుడు నాగబాబు టాలీవుడ్ లో బంధుప్రీతి గురించి స్పందించారు. తన ‘మన ఛానల్ మన ఇష్టం’ యూట్యూబ్ ఛానెల్ లో దీనిపై మూడు ఎపిసోడ్స్ అప్లోడ్ చేశారు. నాగబాబు మాట్లాడుతూ ”ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువైందని ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈ మధ్య ఆ నాలుగు ఫ్యామిలీలు ఆ నాలుగు ఫ్యామిలీలు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. అది కేవలం జలస్ అక్కసు చేతగానితనం కుళ్ళు ఇలాంటివి లోపల ఉన్నవారు మాత్రమే అలాంటి మాటలు మాట్లాడతారు. ఇక్కడ టాలెంట్ ఉన్నవారే నిలబడతారు. దమ్ముంటేనే హీరో అవుతాడు. అంతేకాని టాలెంట్ లేకుండా జనాల మీద రుద్దితే హీరో అవలేరు” అని చెప్పుకొచ్చాడు.

”ముందుగా కుటుంబం గురించి చెప్పుకుంటే చిరంజీవి 20 ఏళ్ళ వయసులో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏ గాడ్ ఫాథర్ లేడు. ఎంతో కష్టపడి మెగా హీరో అయ్యాడు.. ఓ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్ జనరేషన్ లో వచ్చిన బన్నీ వంద శాతం కష్టపడి ప్రూవ్ చేసుకున్న హీరో అతను. చరణ్ కూడా బాంబే వెళ్లి యాక్టింగ్ నేర్చుకుని సినిమాల్లోకి రావడానికి హార్డ్ వర్క్ చేసారు. అంతేకాని చిరంజీవి కొడుకు అని మాత్రమే గుర్తింపు తెచ్చుకోలేదు. సినిమా కోసం చాలా కష్ట పడతాడు.. అతని టాలెంట్ తో ఈ స్థాయికి ఎదిగాడు” అని నాగబాబు చెప్పారు. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ వరుణ్ నిహారిక అందరూ తమ కెరీర్ కోసం సినిమా కోసం విపరీతంగా కష్ట పడతారని.. తేజ్ కి ఈ మధ్య వరుసగా ఐదు సినిమా ప్లాప్ అయ్యాయి.. అప్పుడు ఎంత డిప్రెషన్ కి గురై ఉంటాడు. బంధు ప్రీతితో హిట్ అయ్యేలాగా చేయగలమా? ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా ఫెయిల్యూర్స్ వస్తాయని అన్నారు.

”నాగేశ్వరరావు కొడుకు కాబట్టి నాగార్జునను చూసెయ్యలేదు. ఆయన తన గ్లామర్ తో నటనతో ‘కింగ్’గా ఎదిగారు. అలాగే జూనియర్ ఎన్టీయార్ ఎంత కష్టపడతాడో నేను స్వయంగా చూశాను. ఎన్టీఆర్ కొడుకు అనే బ్యాగ్రౌండ్ ఉన్నా బాలకృష్ణ చాలా కష్టపడి పేరు సంపాదించించుకున్నారు. డ్యాన్సులు ఫైట్స్ తో ఆయనకంటూ సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకుని పెద్ద హీరోగా నిలబడ్డాడు. నాగార్జున కొడుకులు విదేశాల్లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని వచ్చారు. నానా కష్టాలు పడి హీరోలుగా మారారు. వెంకటేష్ – రానా కూడా చాలా కష్టపడ్డారు. అలాగే మహేష్ బాబు కాస్త లావుగా ఉండేవాడు. సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు కేబీఆర్ పార్కులో రోజూ రన్నింగ్ చేసేవాడు. చూస్తుండగానే స్లిమ్ గా మ్యాన్లీగా తయారై పోయాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎంత కష్టపడతాడు అనేది నాకు తెలుసు. ‘అరవింద సమేత’ షూటింగ్ సమయంలో 44 డిగ్రీల ఎండలో షర్ట్ కూడా లేకుండా ఫైట్ చేశాడు. బంధుప్రీతితో వచ్చారు అని బుద్ధి లేని వారు అనే మాట. ఒక లాయర్ కొడుకు లాయర్ అయితే.. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అయితే బంధుప్రీతి తో వచ్చారని ఎందుకు అనరు. ఎందుకంటే వారు కష్ట పడితేనే అలా అవుతారు. కష్ట పడకపోతే ఎవరికీ ఇక్కడ చోటు లేదు. దేవుడి కొడుకైనా.. అతడు నచ్చక పోతే ప్రజలు తిరస్కరిస్తారు. నెపోటిజం పై మాటలన్నీ కుళ్ళు బోతు మాటలు. హిందీ మీడియా లో కూడా ఇండస్ట్రీ లో నెపోటిజం ఎక్కువయిందని బుద్ధిలేని మాటలు అంటోంది. నెపోటిజం అనే పదం వాడటం మీ చేతకాని తనం.. మీ కుళ్ళు నేచర్. ఇక్కడ ఎవరూ నెపోటిజం తో పైకి రాలేదు.. కష్టం తో పైకి వచ్చారు. రవితేజ నాని విజయ్ దేవరకొండ లాంటి వారు బ్యాగ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన వారే. చాలా మంది స్టార్ హీరోల పిల్లలు సక్సెస్ కాలేదనే విషయం తెలుసుకోవాలి” అని నాగబాబు అన్నారు.