నిహారిక నాకు లెటర్ రాసి ఒప్పించింది : నాగబాబు

0

మెగా బ్రదర్ నాగబాబు యూట్యూబ్ లో ఈమద్య అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సార్లు ఎంటర్ టైన్ చేస్తున్నారు.. కొన్ని సార్లు తెలియని విషయాలను తెలియజేస్తున్నారు. మొత్తంగా నాగబాబు ప్రతి వీడియో కూడా అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇటీవల కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాగబాబు చెప్పే ప్రయత్నం చేశాడు. స్నేహితుల మద్య అయినా.. కుటుంబ సభ్యుల మద్య అయినా ఏ ఇద్దరి మద్య అయినా కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. ఆ కమ్యూనికేషన్ సరిగా లేక పోవడం వల్లే ఇబ్బందులు తలెత్తుతాయి అన్నాడు.

సరిగ్గా కమ్యూనికేట్ చేస్తే ఖచ్చితంగా అవతలి వారు కన్విన్స్ అవుతారు. ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు అంటూ నాగబాబు ఒక ఉదాహరణతో తెలియజేశాడు. తన గారాల పట్టి నిహారిక 10వ తరగతి ఉన్న సమయంలో జరిగిన సంఘటనను ఈ సందర్బంగా షేర్ చేసుకున్నాడు. ఒకప్పుడు పిల్లలకు పూర్తి స్వచ్చ ఇచ్చేవారు. కాని ఇప్పుడు పిల్లలను ఎక్కువగా ప్రేమించడంతో పాటు గారాబం చేస్తున్నాం. దాంతో వారికి స్వేచ్చ మిస్ అవుతుంది. అతి ప్రేమతో వారికి స్వేచ్చ ఇవ్వడం లేదు. ఆ కారణంగా వారు కొన్ని మిస్ అవుతున్నారు.

నిహారిక 10వ తరగతిలో ఉత్తరాంచల్ ట్రిప్ కు వెళ్తాను అంది. స్కూల్ వాళ్లు అందరితో కలిసి వెళ్తున్నందున పంపించాలని కోరింది. కాని నేను పది రోజులు అవ్వడం వల్ల పంపించేందుకు ఒప్పుకోలేదు. నాలుగు అయిదు రోజులు రిక్వెస్ట్ చేయడంతో ఇద్దరు బాడీగార్డ్స్ ను పంపిస్తా వారు నీకు దూరంగా ఉంటారు. అందుకు ఓకే అయితే వెళ్లు అన్నాను. కాని తను అందుకు ఓకే చెప్పలేదు. తన స్నేహితులు నవ్వుతారు అంది. ఒక రోజు నా కు లెటర్ రాసింది. అందులో నన్ను కన్విన్స్ చేసిన తీరు నచ్చింది.

నేను నా టీచర్ల నెంబర్స్ ఇస్తాను.. స్నేహితుల నెంబర్స్ ఇస్తాను… ప్రతి రోజు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయి. సిగ్నల్ ఉన్నా లేకున్నా నేను నీకు ప్రతి రోజు కాల్ చేసి ఎక్కడ ఉన్నది చెప్తాను. ప్లీజ్ నాన్న వెళ్లనివ్వు అంటూ కోరింది. తను నన్ను కమ్యూనికేట్ చేసిన విధానం నాకు నచ్చిందని నాగబాబు పేర్కొన్నాడు. ఆ రోజు తను అలా కమ్యూనికేట్ చేయకుంటే నేను ఒప్పుకునే వాడిని కాదు.. తను ఆ మంచి మూమెంట్స్ మిస్ అయ్యేది అంటూ నాగబాబు కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పుకొచ్చాడు.