Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఈ టాలీవుడ్ హీరో ఎవరో గుర్తు పడతారా?

ఈ టాలీవుడ్ హీరో ఎవరో గుర్తు పడతారా?


కొత్త సంవత్సరం.. కొత్త లుక్కు.. ఏమిటీ సర్ ప్రైజ్..? ఇంతకీ ఎవరీ హీరో? గుర్తుపట్టారా? ప్చ్ .. అంత తేలికేం కాదు. అంత ఇదిగా కనిపిస్తోంది ఈ మేకోవర్. ఇంతకీ ఎవరై ఉంటారు? `ఛలో` చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించినా ఆశించిన ఫలితం దక్కలేదు. అయినా ఎంతో పట్టుదల కసితో ఏకంగా లుక్కు మీద రెగ్యులర్ గా ప్రయోగాలు చేస్తున్న ఈ యంగ్ హీరో ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా? .. టాలీవుడ్ ట్యాలెంటెడ్ యంగ్ హీరో నాగశౌర్యనే.

అయితే ఇలా గెటప్పులు మారుస్తుంటేనే గుర్తు పట్టలేక కన్ఫ్యూజ్ అవుతున్నారు .. బోర్న్ హీరోలా బోర్న్ ఐడెంటిటీ మర్చిపోయాడా? అంటూ ఫ్యాన్స్ ఒకటే ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి మొన్నటివరకూ గుబురు గడ్డం కోర మీసం పిలక ముడితో కనిపించిన నాగశౌర్య.. బీస్ట్ లా మారిపోయి కండలు పెంచి కనిపించాడు. ఉన్నట్టుండి ఇలా టర్న్ తీసుకున్నాడేమిటి? అన్నదే సందేహం. న్యూఇయర్ న్యూ లుక్కు అంటూ ఇలా క్లీన్ షేవ్ న్యూ హెయిర్ స్టైల్ తో సడెన్ గా సర్ ప్రైజ్ చేశాడు. లుక్కు అదిరింది. చూస్తుంటే హాలీవుడ్ హీరోలా ఉన్నాడే .. అంటూ వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు సోషల్ మీడియాల్లో.

NS22 సెట్స్ లో ఉంది. ఇంతకుముందు మొదటి రోజు సన్నివేశమిదీ.. వినోదం ప్రారంభమైంది! అంటూ నాగశౌర్య టీమ్ ఒకటే సందడి చేసిన ఫోటో రివీలైంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య అనే వేరొక సినిమా చేస్తున్నాడు. సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రానికి దర్శకుడు. ఇదే గాక మరో రెండు సినిమాలతోనూ అతడు బిజీగా ఉన్నాడు.