Templates by BIGtheme NET
Home >> Cinema News >> మొత్తానికి రానా ‘అరణ్య’ రిలీజ్ డేట్ ఖరారు..

మొత్తానికి రానా ‘అరణ్య’ రిలీజ్ డేట్ ఖరారు..


బాహుబలి సినిమా తర్వాత రానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం “అరణ్య”. ప్రభు సాలొమోన్ దర్శకత్వంలో త్రిభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు తమిళ హిందీ బాషలలో ఒకేసారి విడుదల కానుంది. అయితే గతేడాది ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. పలుమార్లు విడుదల తేదీ ఖరారు అయినట్లే అయింది మళ్లీ వాయిదా పడింది. మొత్తానికి ఆ ఏడాది గడిచింది. ఇక కొత్త సంవత్సరం సందర్బంగా అరణ్య సినిమా థియేటర్లలో విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఇటీవల సినిమా థియేటర్లు ఓపెన్ చేయడం ప్రారంభం అయింది. తమిళనాడులో వందశాతం సీటింగ్ తో ఓపెన్ అవుతుండగా.. తెలుగు రాష్ట్రాలలో యాభై శాతం సీటింగ్ కు అనుమతించింది ప్రభుత్వం.

ఇంతకాలం నిలిపేసిన సినిమాలన్నీ ఇప్పుడు విడుదలకు రెడీ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ 2021 మార్చ్ 26న విడుదల కాబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. రానా దగ్గుబాటి ప్రధానంగా నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణువిశాల్ పులకిత్ సామ్రాట్ మరో కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీయా పిల్గాఒంకర్ జోయా హుస్సేయిన్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు. త్రిభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను ఈరోస్ ఇంటర్నేషనల్ వారు నిర్మిస్తుండటం విశేషం. త్వరలోనే అరణ్య సినిమా నుండి టీజర్స్ సాంగ్స్ విడుదల చేయనున్నారట దర్శకనిర్మాతలు. దాదాపు ఏడాది కాలంగా వాయిదా పడుతున్న ఈ సినిమా విడుదల డేట్ ప్రకటించే సరికి సోషల్ మీడియాలో సినీ అభిమానులలో ఆనందం వ్యక్తం అవుతోంది. మొత్తానికి రానా అరణ్యగా మార్చ్ నెలలో సందడి చేయనున్నాడని అర్ధమవుతుంది.