Templates by BIGtheme NET
Home >> Cinema News >> బుల్లి తెర కోసం డాషింగ్ డైరెక్టర్ రెండు రోజులు

బుల్లి తెర కోసం డాషింగ్ డైరెక్టర్ రెండు రోజులు


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గత ఏడాది మార్చి నుండి ఇప్పటి వరకు షూటింగ్ లు ఏమీ పెట్టుకోకుండా పూర్తిగా ముంబయిలోని తన నివాసంకే పరిమితం అయ్యి ఉంటున్నారు. హైదరాబాద్ కూడా ఎక్కువ రాకుండా పూరి ముంబయికే పరిమితం అవ్వడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. ఎట్టకేలకు పూరి జగన్నాద్ ముంబయి నుండి హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజుల షూటింగ్ నిమిత్తం పూరి హైదరాబాద్ వచ్చారని సమాచారం అందుతోంది. అది కూడా ఒక బుల్లి తెర కార్యక్రమం కోసం అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రముఖ ఛానెల్ కోసం పూరి జగన్నాద్ పర్యావరణంపై ఒక డాక్యుమెంటరీ తెరకెక్కించబోతున్నారు. దాని కోసం రెండు రోజుల పాటు చిత్రీకరణ చేయబోతున్నారు. ఈ డాక్యుమెంటరీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ తో మాట్లాడించడంతో పాటు పలువురు పర్యావరణ వేత్తలతో కూడా మాట్లాడించబోతున్నారు.

ఈ డాక్యుమెంటరీ ఈ నెలాఖరున ఆ టీవీ ఛానెల్ లో ప్రసారం అవ్వబోతుందట. విజయ్ దేవరకొండతో తీస్తున్న ఫైటర్ మూవీని దాదాపు 10 నెలల క్రితం నిలిపేసిన పూరి ఈ నెల చివరికి సినిమాను మళ్లీ పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. పూరి ఈ కరోనా సమయంలో తన అభిప్రాయాలను ఆలోచనలను పాడ్ కాస్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు.