నమ్రత 30 డే మెంటల్ హెల్త్ ఛాలెంజ్

0

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. ఐస్ బకెట్ ఛాలెంజె.. బీ ద రియల్ మ్యాన్ -గ్రో విత్ మీ అంటూ రకరకాల ఛాలెంజ్ లు సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యాయి. దీనికి సినీసెలబ్రిటీ లు రాజకీయ నాయకులు కూడా స్పందించడంతో వైరల్ గా దూసుకెళ్లాయి. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇనిషియేషన్ తెలంగాణ లో పెద్ద సక్సెసైంది.

నేడు వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా.. సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ మరో కొత్త ఛాలెంజ్ ని పరిచయం చేశారు. ఈ ఛాలెంజ్ పేరు 30 డే మెంటల్ హెల్త్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో కండీషన్స్ అప్లయ్ అని అన్నారు. 30 రోజుల ప్లాన్ ని రివీల్ చేశారు.

వైరస్ అంటూ టెన్షన్ సవాళ్లు.. వర్క్ ఫ్రం హోం.. కంప్యూటర్ కే ఎక్కువ సమయం … వ్యాయామం లేకపోవడం.. మొబైల్ వినియోగం.. ఇవన్నీ మానసికంగా హింసించేవే. వీటివల్ల మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకో లేక పోతున్నాం. అందుకే ఈ 30 రోజుల ప్రణాళిక. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి.. మీకు ఎంత వరకు సాయమైందో చెప్పాలి. అంటూ నమ్రత 30 రోజుల చాట్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీనికి స్పందన అద్భుతం గా ఉంది.