జిగి బిగి అందాలు ఎర వేయకలా

0

చిట్టి పొట్టి నిక్కరులో ఇస్మార్ గాళ్ నిధి అగర్వాల్ ధమాకా చూస్తున్నారుగా.. ఆన్ స్క్రీన్.. ఆఫ్ ద స్క్రీన్ అనే తేడా లేకుండా ఇలాంటి ఫోజులివ్వడం నిధికి కొత్తేమీ కాదు కానీ.. ఈసారి ఇంకాస్త హాట్ కంటెంట్ అమాంతం పెంచేసిందనే చెప్పాలి.

ఏదో అలా ఆచేతనంగా జిగి బిగి అందాలను ఎర వేసేస్తే కుర్రకారు ఊరుకుంటారా? ఒకటే కొంటెగా కామెంట్లతో చెలరేగుతున్నారు. డెనిమ్ నిక్కరులో నిధి అందాల దుమారం మామూలుగా లేదు అంటూ తెగ ఇదైపోతున్నారు. కాంబినేషన్ టాప్ తో అందాల నిధి అదరహో అంటూ కవితలు అల్లేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో కుర్రకారు కంటికి కునుకు పట్టనీకుండా చేస్తోంది. అంతర్జాలంలోనూ జోరుగా వైరల్ అయిపోతోంది.

ఇక నిధి కెరీర్ సంగతి చూస్తే గల్లా వారి వారసుడి డెబ్యూ సినిమాలో నాయికగా నటించే ఆఫర్ వచ్చినా ఎందుకనో ఆ ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్ డేట్ ఏదీ ఇటీవల వినిపించలేదు. అలాగే భూమి అనే భారీ చిత్రంతో పాటు ఈశ్వరన్ అనే తమిళ చిత్రంలోనూ నాయికగా నటిస్తోంది. అయితే ఇస్మార్ట్ శంకర్ సక్సెసైనా తెలుగులో ఎందుకనో ఈ అమ్మడికి సరైన ఆఫర్ అయితే రాలేదు.