బిబి3 లో బాలయ్యకు జోడీగా సీత?

0

బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా మరియు లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ సినిమా వారి కాంబోలో హ్యాట్రిక్ గా నిలుస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికి కరోనా కారణంగా సినిమా ఏడు ఎనిమిది నెలలుగా షూటింగ్ నిలిచి పోయింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనే విషయమై చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఆమద్య ఒక మలయాళ హీరోయిన్ ఎంపిక అయ్యిందని కూడా వార్తలు వచ్చాయి. కాని మళ్లీ ఇప్పుడు తెలుగు అమ్మాయి అంజలిని ఈ సినిమా కోసం ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం కొత్త అమ్మాయిని తీసుకు వస్తానంటూ చెప్పిన బోయపాటి మళ్లీ అంజలితో చర్చల నేపథ్యంలో ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో నటింపజేయనున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బాలయ్యతో గతంలోనే అంజలి నటించింది. మరోసారి ఆయనకు జోడీగా నటించేందుకు సిద్దం అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరయిన్స్ నటిస్తే అంజలి సెకండ్ హీరోయిన్ గా కనిపించే అవకాశం ఉంది. బోయపాటి సినిమాల్లో హీరోయిన్స్ ను కాస్త ఎక్కువగా ఏడిపిస్తాడు. మరి అంజలిని బోయపాటి ఈ సినిమాలో ఎంతగా ఏడిపిస్తాడో చూడాలి.