రణబీర్ తో లవ్ లో పడిపోయానంటున్న నిధి బ్యూటీ..!

0

నిధి అగర్వాల్.. ‘మున్నా మైఖేల్’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఫస్ట్ సినిమాలో అందాలు ఆరబోసి తన డాన్సులతో అదరగొట్టినప్పటికీ ఈ బ్యూటీకి బాలీవుడ్ లో అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో అక్కడ లాభం లేదనుకొని సౌత్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా పరాజయం పాలైనా అమ్మడి అందాలు తెలుగు ప్రేక్షకులకి గుర్తుండి పోయాయి. ఈ క్రమంలో అఖిల్ అక్కినేని సరసన ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలోనూ నటించింది నిధి. ఇక పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో ఇస్మార్ట్ గర్ల్ గా మారిపోయింది నిధి అగర్వాల్. ప్రస్తుతం ‘భూమి’ అనే తమిళ్ సినిమాతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలోనూ నటిస్తోంది.

కాగా కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైంది ఇస్మార్ట్ బ్యూటీ. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఇటీవలే ఫేస్ బుక్ లో 8.5 మిలియన్ ఫాలోవర్స్ కి రీచ్ అయిన నిధి అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో రణబీర్ కపూర్ తో లవ్ లో పడిపోయానని.. ఒక్కసారైనా రణ్ బీర్ తో కలిసి నటించాలన్నది తన డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో అవకాశాలు కరువై సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన స్లిమ్ బ్యూటీ నిధి అగర్వాల్ కి.. మళ్ళీ బాలీవుడ్ వైపు వెళ్లాలనే మోజు పెరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ వస్తున్న సమయంలో మళ్ళీ బాలీవుడ్ అంటూ వెళ్లి ఇక్కడ కూడా ఛాన్సెస్ కోల్పోయే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దని సలహా ఇస్తున్నారు.