పెళ్ళైన నాలుగు నెలలకే కూతురికి పేరు పెట్టేసిన యువ హీరో…!

0

ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వివాహం ప్రియసఖి పల్లవి వర్మతో జరిగిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వీరి పెళ్లి కుటుంబ సభ్యులు.. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ న్యూ కపుల్ తమ బేబీ గర్ల్ కి పేరు కూడా పెట్టేశారట. ఈ మధ్యే పెళ్లి అయింది అప్పుడే బేబీకి పేరు పెట్టడం ఏంటని ఆలోచిస్తున్నారా. ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా చెప్పుకొచ్చాడు. అయితే నిఖిల్ చెప్పింది తమకు పుట్టబోయే బిడ్డ గురించి లేండి. ఇటీవల అలీ హోస్ట్ చేసే ఈ షో కి వచ్చిన నిఖిల్ పలు విషయాలు వెల్లడించారు.

కాగా ‘మీ పాప పేరు మాయ అంట కదా.. నీకు మొన్ననే పెళ్లైంది. ఇంతలోనే పాప ఏంటి’ అని అలీ అడుగగా.. నిఖిల్ సమాధానమిస్తూ ”పల్లవిని మీట్ అయిన కొన్ని రోజులకే నా కూతురు పేరు ‘మాయ’ అని అనుకుంటున్నాను. నీకు ఓకే నా అని అడిగాను” అని చెప్పుకొచ్చాడు. దీనికి అలీ ‘అబ్బాయి పుడితే మయాలోడు అని పెడతారా’ అని అంటూ నవ్వులు పూయించారు. ఇదిలావుండగా ‘అర్జున్ సురవరం’ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న నిఖిల్ ప్రస్తుతం ‘కార్తికేయ’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘కార్తికేయ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు ‘కుమారి 21F’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ’18 పేజెస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. వీటితో పాటు నిఖిల్ తన కెరీర్లో 20వ ఈ చిత్రాన్ని నారాయణదాస్ కె నారంగ్ మరియు పుష్కర్ రామ్ ఎమ్ రావ్ నిర్మాణంలో చేయనున్నారు.