స్మిత ‘బహా కిలిక్కి’ సాంగ్ కి రికార్డ్ వ్యూస్…!

0

తెలుగులో పాప్ సింగర్ గా ‘హాయ్ రబ్బా’ ఆల్బమ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రముఖ సింగర్ స్మిత.. ‘బహా కిలిక్కి’ అనే సాంగ్ రూపొందించిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం ‘బాహుబలి’ చిత్రానికి ట్రిబ్యూట్ గా స్మిత ఈ పాటను పాడారు. ‘బాహుబలి’ సినిమాలో కాలకేయుల కోసం రాజమౌళి సృష్టించిన ‘కిలిక్కి’ భాషలో ఈ వీడియో సాంగ్ చేయడం విశేషం. 2015లో యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడి విశేషంగా ఆకట్టుకోబడిన ‘బహా కిలిక్కి’ వీడియో సాంగ్.. 100 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి నాన్ ఫిల్మ్ రీజనల్ సాంగ్ గా రికార్డ్స్ క్రియేట్ చేసింది.

కాగా ‘బహా కిలిక్కి’ వీడియో సాంగ్ కాన్సెప్ట్ ప్రముఖ దర్శకుడు దేవా కట్ట డిజైన్ చేయగా మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు సంగీతం అందించారు. మధన్ కార్కీ ఈ పాటకు సాహిత్యాన్ని అందించగా బాస్కో కొరియోగ్రఫీ చేశారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. ఇక స్మిత ఈ పాటను ఆలపించడంతో పాటు నర్తించింది. సింగర్ నోయల్ ర్యాప్ పాడాడు. ఇందులో ‘బాహుబలి’ చిత్రంలో కాలకేయ పాత్ర పోషించిన ప్రభాకర్ తో కలిసి ‘కిలిక్కి’ భాషలో స్మిత ఈ పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్ లో కాలకేయుడిగా ప్రభాకర్.. స్మిత విభిన్నమైన గెటప్ వీక్షకులను అలరించాయి.