టాలీవుడ్ సింగర్ యాక్టర్ నోయెల్.. హీరోయిన్ ఎస్తేర్ లు విడాకులు తీసుకున్నారు. ‘వెయ్యి అబద్ధాలు’ ‘భీమవరం బుల్లోడు’ ‘గరం’ ‘జయజానకి నాయక’ ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ఎస్తేర్.. నటుడు సింగర్ నోయెల్ ని గతేడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు కుటుంబాలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య ఐదారు నెలలకే మనస్పర్థలు వచ్చాయని.. గత కొంతకాలంగా కలిసి ఉండటం లేదని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు నోయల్ తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అటు నోయెల్ ఇటు ఎస్తర్ ఇద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.
కాగా గత ఏడాది జూన్ లో మ్యూచువల్ డైవర్స్ కు అప్లయ్ చేసుకున్న వీరిద్దరికీ విడాకులు మంజూరు చేస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే డివోర్స్ కోసం దరఖాస్తు చేశామని.. ఇన్నాళ్లు కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూశానని నోయల్ తెలిపాడు. అంతేకాకుండా అభిప్రాయ భేదాల కారణంగా తాము విడిపోతున్నామని.. తమ మధ్య ఉన్న అందమైన బంధాన్ని.. దాని విలువను కాపాడుకునేందుకు ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎస్తేర్ భవిష్యత్ బాగుండాలని తనకు అంతా మంచే జరగాలని తను కన్న కలలు నిజం కావాలని నోయల్ చెప్పుకొచ్చాడు. విడాకుల విషయంలో తన కుటుంబాన్ని గానీ.. ఎస్తేర్ ను గానీ ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశాడు. సరికొత్త ఆశలతో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. అలాగే కష్ట సమయాల్లో తనకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నోయల్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.
మరోవైపు ఎస్తేర్ కూడా దీనిపై ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ”గత ఏడాదిగా నన్ను తరచుగా అడిగే ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉంది.. దీని కోసం ఓపికగా ఎదురుచూస్తున్నాను.. కాని ఇది చట్టబద్ధంగా అధికారికంగా వెలువడక ముందే చెప్పడానికి నేను ఇష్టపడలేదు. నేను నోయెల్ 2019 జనవరి 3న వివాహం చేసుకున్నాము. మేము సర్దుబాటు సమస్యల కారణంగా కొద్దికాలానికే మేము విడిపోయి 2019 జూన్ లో ఒక మ్యూచువల్ డైవర్స్ కోసం అప్లై చేశాము. అప్పటి నుండి సైలెంటుగా నిన్నటి వరకు వేచి ఉన్నాను. నేను ఎప్పుడూ క్లారిటీతో నిజాయితీగా ఉంటాను. ఈ విషయం యొక్క సెన్సివిటీని నా ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలని నేను మీ అందరిని అభ్యర్థిస్తున్నాను. మీరు దీన్ని గౌరవిస్తారు మరియు మీరు ఎప్పటిలాగే ఈ విషయంలో నాతో ఉంటారు. మనమందరం మనుషులం.. మన జీవితంలో అనేక హెచ్చు తగ్గులు ఎదురవుతున్నాయి.. మనందరికీ విఫలమైన సంబంధాలు కూడా ఉంటాయి. దానిని ఎదుర్కోవడం ఎంత క్లిష్టంగా మరియు ఒత్తిడితో కూడుకున్నదో నాకు తెలుసు. కాబట్టి ఈ విషయంపై నా స్టేట్మెంట్ ని పరిగణించాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. ఇంటర్వ్యూలు మీడియా దృష్టి వ్యాఖ్యలు నిజమైన లేదా వర్చువల్ రూపంలోనైనా చర్చించవవద్దు. నన్ను అర్థం చేసుకున్నందుకు.. ఇప్పటి వరకు మీరు అందించిన ప్రేమ మద్దతు దయ ప్రార్థనలు మరియు ఆశీర్వాదాల కోసం నేను ఎప్పటికి కృతజ్ఞతతో ఉంటాను” అని ఎస్తేర్ పేర్కొంది.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
