అందుకే ప్లాస్మా ఇవ్వలేదు: రాజమౌళి

0

జక్కన్న రాజమౌళి ఫ్యామిలీ కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే. అందరు కూడా రెండు వారాల తర్వాత కరోనాను జయించారు. కరోనా పాజిటివ్ అంటూ చెప్పిన సమయంలోనే రాజమౌళి నెగటివ్ వచ్చిన వెంటనే తాను తన కుటుంబ సభ్యులందరం కలిసి ప్లాస్మా దానం చేస్తానంటూ ప్రకటించాడు. కరోనాను జయించిన ప్రతి ఒక్కరు కూడా ప్లాస్మా దానం చేయాలంటూ రాజమౌళి విజ్ఞప్తి చేశాడు.

కరోనాను జయించిన తర్వాత ప్లాస్మా దాతలను సన్మానించిన సమయంలో రాజమౌళి మాట్లాడుతూ త్వరలోనే తాను కూడా ప్లాస్మా దానం చేస్తానంటూ ప్రకటించాడు. వైధ్యలు కొన్ని రోజులు వెయిట్ చేయాలని సూచించారని అన్నాడు. అయితే తాజాగా తాను ప్లాస్మా దానం చేయలేక పోతున్నట్లుగా పేర్కొన్నాడు. శరీరంలో ఉన్న యాంటీ బాడీస్ ను బట్టి ప్లాస్మా దానం చేయాల్సి ఉంటుంది.

ఐజీజీ లెవల్స్ 15 కంటే ఎక్కువ ఉన్న వారు మాత్రమే ప్లాస్మా దానంకు అర్హులు. కాని నాకు ఐజీజీ 8.62 మాత్రమే ఉన్నాయి. కనుక నేను ప్లాస్మా దానంకు అనర్హుడిని అంటూ వైధ్యులు చెప్పారు. అందుకే నేను ప్లాస్మా దానం చేయలేక పోయాను అన్నాడు. అయితే పెద్దన్న (కీరవాణి) మరియు భైరవలు నేడు ఉదయం ప్లాస్మా దానం చేసినట్లుగా రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కోవిడ్ నుండి బయట పడ్డ ప్రతి ఒక్కరు కూడా ప్లాస్మా దానంకు ముందుకు రావాలంటూ రాజమౌళి మరోసారి విజ్ఞప్తి చేశాడు.