సరోవరం నుంచి దారి తప్పి జనారణ్యంలో చిక్కిన హంస

0

బాహుబలి మనోహరిగా గ్రీకు బ్యూటీ నోరా ఫతేహికి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో రకరకాల క్రియేటివిటీతో ఫోటో ట్రీటిచ్చింది. నిరంతరం ఇన్ స్టా మాధ్యమంలో ఫోటోషూట్లను షేర్ చేసింది. ఇక జిమ్ యోగా వీడియోలతోనూ నోరా అదరగొట్టింది. ఇక అదిరిపోయే నృత్యవిన్యాసాలకు సంబంధించిన వీడియోలతోనూ ఫ్యాన్స్ ని నిరంతరం యంగేజ్ చేస్తూనే ఉంది సామాజిక మాధ్యమాల్లో.

ఇక ఈ సిరీస్ లో భాగంగానే తాజాగా నోరా షేర్ చేసిన ఫోటో యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. మనోహరి టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్ లో దుమ్ము దులిపేసింది. మానస సరోవరంలో హంసలా మనోహరి ఫోజు అదిరిందిగా అంటూ బోయ్స్ ఒకటే కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

హిమాలయాల్ని ఈ అమ్మడు తన మేనిలోకి ఇంకిపోయేలా చేసిందా? అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. నోరాకి బాడీ ఫిట్ డిజైనర్ వైట్ డ్రెస్ ని అందించిన స్పెషలిస్టుని పొగిడి తీరాల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలతో కంటే టీవీ షోలతోనూ అదరగొడుతోంది. హిందీ బెల్టులో తనకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా పలు చానెళ్లు డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జీగా ఆహ్వానిస్తున్నాయి. భుజ్ – ది ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే భారీ హిస్టారికల్ వార్ యాక్షన్ డ్రామాలో దుమారం రేపే యాక్షన క్వీన్ గా నోరా కనిపించనుందట. 1971 ఇండో పాక్ వార్ నేపథ్యంలో దేశభక్తి ప్రధాన చిత్రమిది.