ఈసారి అమీర్ ఖాన్ ని టార్గెట్ చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్..!

0

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వార్ కి ఫుల్ స్టాప్ పడేలా లేదు. ఇప్పటికే క్వీన్ కంగనా మీద కొన్ని కేసులు నమోదు కాగా లేటెస్టుగా దేశద్రోహం కేసు నమోదయింది. మహారాష్ట్ర ప్రభుత్వం మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. రైతులను కించపరిచారని కంగనాపై కేసులు నమోదైనాయి. ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని కంగనా మరియు ఆమె సోదరి రంగోళిపై ముంబైలో కేసు నమోదు చేశారు. అయితే దీనికి ఏమాత్రం భయపడని కంగనా రనౌత్ మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై ట్వీట్ల దాడి చేసింది. అంతేకాకుండా ఈసారి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ని కూడా టార్గెట్ చేసింది.

”రాణీ లక్ష్మీబాయి కోటను కూల్చినట్టే నా ఇంటిని కూల్చారు. తిరుగుబాటు చేసినందుకు సావర్కర్ జైలు శిక్ష అనుభవించినట్లే నన్ను కూడా జైల్లో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నేను దేనికీ తలవంచను. ఈ అసహనపు దేశంలో ఎన్ని కష్టాలు పడ్డారో దయచేసి అసహనపు గ్యాంగ్ ను అడగండి” అంటూ ట్వీట్ చేసింది కంగనా. దీనికి అమీర్ ఖాన్ ని ట్యాగ్ చేసింది. అమీర్ ఖాన్ గతంలో ‘ఇంటోలరెన్స్'(అసహనం) పై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపిన సంగతి తెలిసిందే.

దేశంలో అసహనం పెరిగిపోతోందని.. నా భార్య దేశం వదలి వెళ్లి పోదామంటోందని అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడాడు. ఇప్పుడు కంగనా పరోక్షం గా అమీర్ ఖాన్ వ్యాఖ్యలని ఎత్తి పొడుస్తూ ఈ ట్వీట్ చేసినట్లు అర్థం అవుతోంది. ఇంతక ముందు ‘క్యాండిల్ మార్చ్ గ్యాంగ్.. అవార్డు వాపసీ గ్యాంగ్… చూడండి.. నేను మీలా కాదు. మహారాష్ట్రలో పాలన సాగిస్తున్న ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. అందులోనే నా జీవితానికి అర్థం ఉంది. నేను మీ అందరిలా మోసగత్తెను కాను’ అని కంగనా రనౌత్ ట్వీట్ చేసింది.