Templates by BIGtheme NET
Home >> Cinema News >> బాహుబలి మనోహరి ఫాలోయింగ్ ఆ లెవల్లో

బాహుబలి మనోహరి ఫాలోయింగ్ ఆ లెవల్లో


బాహుబలి మనోహరి నోరా ఫతేహికి వరల్డ్ వైడ్ ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. నోరా తనదైన డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో అభిమానుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె అంతర్జాతీయ అభిమానుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోందని తెలుస్తోంది. ఆమె నృత్య కదలికలు భంగిమలకు సరిపడే అసమానమైన అందం అందుకు ఓ ప్రత్యేక కారణం. ఇక నోరా డ్యాన్సుల్ని అనేక దేశాల్లో కాపీ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల షేర్ చేసిన వీడియోలో నోరా రష్యన్ అభిమాని రీసెంట్ బ్లాక్ బస్టర్ `సాకి సాకి..` పాటకు హుక్ స్టెప్ నేర్పిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. నోరా తన ఇన్ స్టాగ్రామ్ లో ఆ స్టెప్పులతో డాన్స్ వీడియోను తిరిగి షేర్ చేసింది.

ఒక రష్యన్ డ్యాన్స్ ట్రైనర్ తన విద్యార్థులకు నోరా ఫతేహి స్మాషింగ్ హిట్ సాంగ్ సాకి సాకి హుక్ స్టెప్ నేర్పిస్తున్న వీడియో టిక్ టాక్ (రష్యా) లోనూ వైరల్ అవుతోంది. ఈ వీడియో నోరా ఫతేహి దృష్టిని ఆకర్షించిగా నోరా స్వయంగా షేర్ చేసింది. సాకి సాకి పాటలో నోరా ఫతేహి కనుబొమ్మల ఎక్స్ ప్రెషన్ స్టైల్ ని సదరు రష్యన్ ట్రైనర్ పట్టుకున్నాడు. ఆమె నృత్య కదలికలు కిల్లర్ స్టైల్ లో ఆకర్షించింది.

అలాగే నోరా డ్యాన్సుల్లో `నాచ్ మేరీ రాణి..` జపనీల్లో విశేష ఆదరణ పొందింది. ఇంతకు ముందు నోరా ఫతేహి జపనీస్ అభిమానులు నాచ్ మేరీ రాణికి అద్భుతమైన నృత్యం చేసిన వీడియో వైరల్ అయ్యింది. నలుగురు బాలికలు డ్యాన్స్ కదలికలను అనుసరించడం ఆకట్టుకుంది. నోరా తన అభిమానుల్లో ఇది వైరల్ అయ్యింది. అంతర్జాతీయ స్థాయిలో తమ డ్యాన్సులకు అభిమానం సంపాదించుకోవడంలో టాలీవుడ్ స్టార్లు బన్ని.. ఎన్టీఆర్ లకు ఓ రికార్డ్ ఉంది. హృతిక్ .. టైగర్ ష్రాఫ్ సహా పలువురు బాలీవుడ్ స్టార్లకు ఈ స్థాయి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు నోరాకి ఆ రేంజుందని ప్రూవైంది.

నోరా ఫతేహి చివరిసారిగా పెద్ద తెరపై రెమో డిసౌజా చిత్రం `స్ట్రీట్ డాన్సర్ 3D` లో కనిపించారు. ఆమె ఇటీవల గురు రాంధవా హిట్ సాంగ్ `నాచ్ మేరీ రాణి`లో నర్తించింది. ఇది విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది. ఆమె తదుపరి భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలో కనిపిస్తుంది.