Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఎవరు మీలో కోటీశ్వరులు – కొరటాల మూవీ… ఓ చిన్న క్లారిటీ

ఎవరు మీలో కోటీశ్వరులు – కొరటాల మూవీ… ఓ చిన్న క్లారిటీ


ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. జక్కన్న కోసం దాదాపుగా మూడు సంవత్సరాల సమయంను కేటాయించిన ఎన్టీఆర్ తదుపరి సినిమా ను ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. గత ఏడాది ఆరంభం నుండి ఇప్పటి వరకు ఎన్టీఆర్ తదుపరి సినిమా గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది ఆరంభంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను ప్రకటించారు. కాని కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది.. అలాగే జెమిని టీవీ వారు ప్లాన్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు ఎప్పుడు టెలికాస్ట్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అంటూ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.

తాజాగా ఎన్టీఆర్ సన్నిహితులు మరియు మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఎవరు మీలో కోటీశ్వరులు షో ను చేయబోతున్నాడు. ఆ షో కొన్ని రోజుల షూట్ పూర్తి అయిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని కొరటాల శివ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత సినిమా మరియు షో ను సమాంతరంగా చేసుకుంటూ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు షో పూర్తి అయ్యే వరకు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా మొదలు కాకపోవచ్చు అంటూ వస్తున్న వార్తలు నిజం కాదంటున్నారు.

ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం ఎన్టీఆర్ వారంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని.. మిగిలిన గ్యాప్ లో సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని అంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాను వచ్చే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఆచార్య పూర్తి చేసిన వెంటనే కొరటాల శివ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో చేసేందుకు సిద్దం అవ్వబోతున్నాడు.