ఆఫ్టర్ డెలివరీ.. బయటకొచ్చిన విరుష్క.. ఎలా ఉన్నారంటే..

0

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బెటర్ హాఫ్ అనుష్క.. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జనవరి 11వ తేదీన వీరి వారసురాలు ఈ ప్రపంచంలోకి వచ్చింది. ఈ సమయంలో దగ్గరగా ఉండాలంటూ.. ఆస్ట్రేలియా టూర్ మధ్యలోనే వచ్చేశాడు కోహ్లీ.

కాగా.. డెలివరీ అయిన ఇన్నాళ్ల తర్వాత అనుష్క విరాట్ కోహ్లీ బయట కనిపించారు. తనలో ఎలాంటి ఛేంజ్ లేదని చాటి చెప్పాలని అనుకున్నారో ఏమో.. మోడ్రన్ డ్రెస్ లో ట్రెండీగా దర్శనమిచ్చింది అనుష్క. తల్లి కాకముందు ఎలా ఉండేదో.. అలాంటి లుక్ తోనే కనిపించింది.

కోహ్లీ టాప్ టూ బాటమ్ బ్లాక్ డ్రెస్ వేస్తే.. అనుష్క జీన్స్ బ్రాండ్ ధరించింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో వీరు కనిపించారు. హాస్పటిల్ కు వెళ్తుండా తీసిన ఫొటోగా సర్క్యులేట్ అవుతోంది. అయితే.. వీరి ముద్దుల పాప ఫొటోలు మాత్రం ఇప్పటి వరకూ సోషల్ మీడియాకు ఎక్కలేదు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పిల్లల పెంపకం గురించి మాట్లాడిన అనుష్క.. తాను ప్రగతిశీల కుటుంబం నుండి వచ్చానని చెప్పింది. తమ పిల్లల్ని కూడా అలాగే పెంచాలనుకుంటున్నాం అని చెప్పిన అనుష్క.. తమ బిడ్డను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇది కొద్దిగా కష్టమే అయినా.. పాటిస్తామని ప్రకటించింది. ఆ నిర్ణయం ప్రకారమే బేబీ ఫొటోను షేర్ చేయట్లేదు కావొచ్చు.