పవన్ కళ్యాణ్ మాదాపూర్ టూ మియాపూర్ మెట్రో ప్రయాణం..!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ”వకీల్ సాబ్”. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు. ‘ఓ మై ఫ్రెండ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ కూడా సెట్స్ లో అడుగుపెట్టేసాడు. షూటింగ్ నిమిత్తం ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేశాడు. చిత్ర యూనిట్ తో కలిసి మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు పవన్ మెట్రో జర్నీ చేశాడని తెలుస్తోంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ఇందులో పవన్ సినిమాలో పోషిస్తున్న లాయర్ గెటప్ లోనే కనిపిస్తున్నాడు. మెట్రోలో పవన్ తో పాటు ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఉన్నారు.

కాగా పవర్ స్టార్ రీ ఎంట్రీ మూవీగా వస్తున్న ‘వకీల్ సాబ్’ ని కరోనా విజృంభణ లేకపోయుంటే సమ్మర్ లోనే రిలీజ్ చేసేవారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహకాలు చేస్తున్నారని తెలుస్తోంది. ‘అజ్ఞాతవాసి’ వంటి పరాజయం తర్వాత వస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే తెలుగు వర్షన్ లో చాలా మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది. ఈ చిత్రంలో శృతి హాసన్ – అంజలి – నివేదా థామస్ – అనన్య – ప్రకాష్ రాజ్ – సీనియర్ నరేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.