ఆర్డీఎక్స్ బాంబ్ వంటి అందం

0

ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా సందడి చేస్తూనే ఉంది. ఈ అమ్మడి ఫొటో షూట్ స్టిల్స్ హాట్ స్టిల్స్ రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటో లు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ లాక్ డౌన్ లో ఈ అమ్మడు చాలా బక్కచిక్కినట్లుగా ఈ ఫొటోను చూస్తుంటే అనిపిస్తుంది. స్టైలిష్ లుక్ మరియు మోడ్రన్ డ్రస్ తో అమ్మడిని ఈ స్టిల్ లో చూడవచ్చు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫొటోలతో మంచి గుర్తింపు దక్కించుకుంది.

ఈమె ప్రస్తుతం నెట్టింట తెగ హడావుడి చేస్తోంది. దీంతో ఈమెను పలువురు ఫిల్మ్ మేకర్స్ సంప్రదిస్తున్నారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు స్టార్ హీరోల సినిమాల్లో సైతం నటించేందుకు ఎదురు చూస్తోంది. అందుకే ఫిజిక్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే అందాల ప్రదర్శణ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ వచ్చే ఏడాది ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతున్నాయి. ఆర్ ఎక్స్ 100 మరియు ఆర్డీఎక్స్ లవ్ సినిమాల తర్వాత ఈమెకు ఎక్కువగా బోల్డ్ పాత్రలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే వాటి నుండి బయట పడుతోంది.