పవన్ కళ్యాణ్‌కు పాయల్ రాజ్‌పుత్ పుట్టినరోజు కానుక

0

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వతహాగా స్వీకరించిన RX 100 ఫేమ్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఉన్న తన నివాసంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ.. ‘‘నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తిచేశాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మొక్కలు నాటాలనే గొప్ప ఆలోచనతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. నేను ప్రగ్యా జైశ్వాల్, కరణ్ శర్మ, సౌరభ్ దింగ్రా, రవితేజను నామినేట్ చేస్తున్నాను. నా వంతు నేను పూర్తిచేశాను.. ఇక మీ వంతు మిగిలి ఉంది. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి, ఎంపీ సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.

Inspired by #GreenIndiaChallenge planted 3 saplings. I nominate @jaiswalpragya @raviteja_2628 @karansharmaa_official @theessdee to plant 3 🌱 to take up the challenge 🌱🌳. I thank @mpsantoshtrs garu for this great initiative & I dedicate this to @ pawankalyan sir on his birthday.

null

తాను మొక్కలు నాటిన వీడియో, ఫొటోలను పాయల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తాను నాటి మొక్కలను పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి అంకితం ఇస్తున్నట్టు పాయల్ పేర్కొన్నారు. ఇక పాయల్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. ‘5 Ws’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పాయల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. గుణశేఖర్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రణదీప్ కిశోర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కైవల్య క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి యశోద ఠాకోర్ నిర్మిస్తున్నారు.

#greenindiachallenge 🌱

null