మళ్ళీ పూజా కే స్టార్ డైరెక్టర్ ఓటు.. మరో యంగ్ బ్యూటీకి కూడా చోటు..?

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ(చినబాబు) – నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే ఈ సినిమాని స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆల్రెడీ హీరోయిన్లను ఫైనలైజ్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ హీరోయిన్ పూజాహెగ్డే ని మళ్ళీ ఈ సినిమాలో కూడా తీసుకోబోతున్నారట. ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ బుట్టబొమ్మకి హీరో సైడ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నెల్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో మరో హీరోయిన్ కి కూడా అవకాశం ఉందట. దీని కోసం యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ‘రెడ్’ సినిమాల్లో నటించిన అమృత అయితే.. స్క్రీన్ పై ఫ్రెష్ నెస్ కనిపిస్తుందని మేకర్స్ భావిసున్నారట. మరి చిరవరకి ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.

ఇక ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్న త్రివిక్రమ్.. దానికి తగ్గట్టుగా ప్లాన్స్ చేసుకుంటున్నాడట. 2021 ఫిబ్రవరిలో సెట్స్ మీదకి తీసుకొచ్చి.. ఏడాది మొత్తం ఈ ప్రాజెక్ట్ కే టైమ్ కేటాయించాలని నిర్ణయించుకున్నాడట. అందులో మ్యూజిక్ సెషన్స్ కోసం దాదాపుగా 6 నెలలు కేటాయించాలని అనుకుంటున్నాడట. త్రివిక్రమ్ తెరకెక్కించిన గత రెండు చిత్రాల విజయంలో మేజర్ రోల్ ప్లే చేసిన థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకునే అవకాశాలున్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ చిత్రంలో ఓ సామాజిక అంశాన్ని ప్రస్తావించబోతున్నారని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు.