సన్నబడాలనే కోరికే నటి ప్రాణాలు తీసింది

0

నటి మిస్తి ముఖర్జీ ఆకస్మిక మరణం ఆమె సన్నిహితులతో పాటు ఆమెను అభిమానించే వారికి తీరని శోకంను మిగిల్చింది. 27 ఏళ్ల వయసులోనే కిడ్నీ సమస్యతో ఆమె మృతి చెందడం వైధ్యులను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందట. ఆమె చాలా లావుగా ఉండటం వల్ల కొన్నాళ్లుగా కీటో డైట్ ను ఫాలో అవుతుందట. ఆ కీటో డైట్ వల్ల ఆమె కిడ్నీ చెడి పోయింది. ఆ కారణంగా విపరీతమైన కిడ్నీ పెయిన్ రావడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. అక్కడ చికిత్స పొందుతూనే ప్రాణాలు వదిలేసింది.

కీటో డైట్ ప్రకారం మితంగా తినాల్సి ఉంటుంది. అందులో కూడా కొవ్వు పదార్థాలు 75 శాతం.. ప్రోటీన్ లు 20 శాతం.. కార్బో హైడ్రైడ్ లు 5శాతం మాత్రమే ఉంటాయి. కీటో డైట్ వల్ల లావు స్పీడ్ గా తగ్గుతారు కాని ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉంటాయని ఇప్పటికే వైధ్యులు పేర్కొన్నారు. అయినా కూడా చాలా మంది కీటో డైట్ నే ఫాలో అవుతున్నారు. నటి మిస్తి ముఖర్జీ కూడా బరువు తగ్గేందుకు ఆ డైట్ ను ఫాలో అవ్వడం వల్ల ఇలా మృతి చెంది ఉంటుందని వైధ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. గత కొన్ని రోజులుగా విపరీతమైన నొప్పితో మిస్తి బాధపడింది. చనిపోయే ముందు వరకు కూడా ఆమెకు తీవ్రమైన నొప్పిగా ఉందని ఆమె నొప్పి భరించలేక బాధపడుతుంటే తాము కూడా ఎంతో బాధపడ్డామంటూ కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకోవడం అందరిని కదిలించింది.