పవన్ వల్ల వచ్చే ఆ సైలెన్స్ కోసం వెయిటింగ్: హరీష్ శంకర్

0

పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందబోతుంది. అంతకు ముందు పవన్ వకీల్ సాబ్ మరియు క్రిష్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఆ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయబోతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వీరిద్దరి కాంబో మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రాబోతుంది. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ తర్వాత వెంటనే వీరి కాంబో మూవీ ఉంటుందని అంతా భావించిన తదుపరి సినిమా సెట్ అవ్వడానికి ఏకంగా ఎనిమిది ఏళ్లు పట్టింది.

తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థతో హరీష్ శంకర్ మాట్లాడుతూ పవన్ తో చేయబోతున్న సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఎనిమిది సంవత్సరాల క్రితం పవన్ తో సినిమా తీసిన సమయంను ఆయన గుర్తు చేసుకున్నాడు. షూటింగ్ సెట్ లో 200 మంది ఉండగా గోల గోలగా ఉండేది. ఎప్పుడైతే పవన్ గారు వస్తారో అప్పుడు అంతా కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అవుతుంది. ఆయన వచ్చాడు అంటూ అంతా నిశబ్దం అవ్వడం ఆశ్చర్యంగా అనిపించేది. మళ్లీ ఆ నిశబ్ద వాతావరణం కోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు. ఇంకా ఎప్పుడు పవన్ తో మూవీ చేసేది ఆయన క్లారిటీగా చెప్పలేదు. వచ్చే ఏడాదిలోనే సినిమాను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మాత్రం మీడియా సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది.