45లో 25 లుక్ తో కిల్లింగ్

0

బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ ప్రీతి జింతా. తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించి సూపర్ హిట్స్ అందుకున్న ఈమె కెరీర్ చివర్లో బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. ఇక ఈమద్య కాలంలో సినిమాలకు దాదాపుగా దూరంగా ఉంటుంది. 2018లో వెల్ కమ్ టు న్యూయార్క్ సినిమా చేసినా ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. బుల్లి తెర మరియు వెండి తెర అనే తేడా లేకుండా ఈమె ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. ఐపీఎల్ ఒక జట్టు ఓనర్ గా రెగ్యులర్గా మీడియాలో ఉంటూనే ఉన్న ప్రీతి జింతా తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫొటో వైరల్ అవుతోంది.

ప్రీతి జింతా వయసు 45 ఏళ్లు. కాని ఆమె ఫిజిక్ మరియు యాక్టివ్ చూస్తూ ఉంటే ఆమె ఇంకా పాతిక ఏళ్లలోనే ఉండి పోయిందా అనిపిస్తుంది. యంగ్ హీరోయిన్స్ కు సైతం పోటీ ఇచ్చేంతటి గ్లామర్ తో ప్రీతి ఇప్పటికి తన అభిమానులకు మత్తెక్తిస్తూనే ఉంది. తన సొట్టబుగ్గలతో 197080 కిడ్స్ ను కిర్రెక్కించిన ఈ అమ్మడు 2000 కిడ్స్ కూడా ఫేవరెట్ అయ్యింది. అయిదు పదుల వయసు దగ్గరకు వచ్చినా కూడా ఈమె ఇంకా పాతికేళ్ల అమ్మాయిగా కనిపించడం నిజంగా ఆశ్చర్యం.

ఈ ఫొటోకు నెటిజన్స్ నుండి విపరీతమైన స్పందన వచ్చింది. కాలంతో పాటు మీ వయసు నెంబర్ పెరుగుతుంది కాని మీరు మాత్రం అలాగే ఉంటున్నట్లుగా అనిపిస్తుందని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తానికి ప్రీతి జింతా ఇంకా హీరోయిన్ గా నటించినా ప్రేక్షకులు చూసేవిధంగానే ఆమె ఫిజిక్ గ్లామర్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.