దేశంలోనే ‘ఫస్ట్ వర్చ్యువల్ మూవీ’లో నటిస్తున్న స్టార్ హీరో..!!

0

Prithviraj Sukumaran Is acting in First Virtual Movie in the country

Prithviraj Sukumaran Is acting in First Virtual Movie in the country

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవలే ఆడుజీవితం అనే సినిమా షూటింగు జోర్డాన్ దేశంలో ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ సరికొత్త చిత్రంలో నటించనున్నట్లు పృథ్వీరాజ్ తన ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో ప్రకటించాడు. అలాగే ప్రకటనతో పాటు ఒక పోస్టర్ కూడా షేర్ చేసాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “ఫిల్మ్ మేకింగులోనే ఇదొక గొప్ప కళ.. అలాగే విజ్ఞాన శాస్త్రంలో ఇదొక ఉతేజాన్నిచ్చే కొత్త అధ్యాయం.. అందుకోసం ఎదురుచూస్తూ ఉండండి. మారుతున్న కాలాలు కొత్త కొత్త సవాళ్లు వినూత్న పద్ధతులను అనుసరించి ఒక గొప్ప పురాణ కథను గొప్పగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. అప్డేట్స్ కోసం వేచి ఉండండి” అంటూ పోస్టర్ కింద మెన్షన్ చేసాడు. ఇక పోస్టర్ చూసినట్లయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ ఒక యోధునిగా కనిపిస్తాడని అర్ధమవుతుంది.

అయితే భారతదేశపు మొట్టమొదటి వర్చ్యువల్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు తెలిపారు. ఇంకా టైటిల్ ఖరారు గాని ఈ ప్రాజెక్టును గోకుల్రాజ్ బాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను హిందీ మలయాళం తెలుగు తమిళం మరియు కన్నడ భాషలలో విడుదల చేయనున్నారట. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ప్రారంభంలో “అయ్యప్పనమ్ కోషియం” అనే సినిమాతో తన ఖాతాలో బ్లాక్ బస్టర్ వేసుకున్నాడు. దివంగత సచి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకొని వేరే భాషలలోకి రీమేక్ అవుతుంది. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమాలో పృథ్వీరాజ్ తో పాటు బిజూ మీనన్ ప్రధాన పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు హిందీ రీమేక్ పనులలో బిజీగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఈ రీమేక్ ను హిందీలో బ్యాంక్ రోలింగ్ చేయనున్నారు. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ మరియు ఒక హవల్దారు మధ్య ఇగో చుట్టూ తిరిగే ఈ కథను థ్రిల్లర్ మూవీగా అందించారు. తాజాగా ఆయన వర్చ్యువల్ మూవీ ప్రకటన రాగానే నెటిజన్లలో ఆసక్తి నెలకొంది.