ఇద్దరు రాజులు ఏకమయ్యారే ? జనాలు పీక్కోవాల్సిందేనా ?

0

మొత్తానికి ఇద్దరు రాజులు ఏకమయ్యారు. ఇద్దరిదీ దాదాపు ఒకే రకమైన మనస్తత్వం. ఒకరేమో వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజు. మరొకరేమో సినీ ఫీల్డులో పరిచయం అవసరం లేని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల వర్మ. ఇద్దరు కలిసారంటే ఎవరికి మూడిందో ఏం పాడో. ఎందుకంటే తిరుగుబాటు ఎంపి యేమో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా ప్రతిరోజు రెచ్చిపోతు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఇక వర్మ యేమో నోటికి ఏదోస్తే అది ఎవరి మీద పడితే వారి మీద కామెంట్లు చేసే వ్యక్తి.

ఇలాంటి ఇద్దరు వ్యక్తులు కలిశారంటే ఎవరికి మూడిందో ఏమో అనే ఉత్కంఠ జనాల్లో మొదలైపోయింది. పైగా వర్మ తన ట్విట్లర్లో మూడు ఫొటోలు జతచేశారు. దానిపై ఆర్ఆర్ఆర్+ఆర్= బస్తీమే సవాల్ అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టారు. అలాగే ఆర్ఆర్ఆర్ ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారో గెస్ చేయమని రెండో క్యాప్షన్ పెట్టారు. చివరగా మూడో ఫొటో మీదేమో ఐ జాయిండ్ ది పొలిటికల్ గ్యాంగ్ ఆప్ @ రఘురామరాజు_ఎంపి అనే ట్యాగ్ తగిలించారు.

వర్మ పోస్టు చేసిన ఫొటోలకు తగిలించిన ట్యాగులకు ఏమన్నా సంబంధం ఉందా లేకపోతే మామూలుగానే చేసే ఉత్త హడావుడి మాత్రమేనా అని తెలీక జనాలు జుట్టు పీక్కుంటున్నారు.