Templates by BIGtheme NET
Home >> Cinema News >> #RRR గిరిజన బిజిలీగా తెలుగమ్మాయ్

#RRR గిరిజన బిజిలీగా తెలుగమ్మాయ్


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఈ చిత్రం కోసం మొత్తం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవలే ఈ చిత్రం నుంచి వచ్చిన కొమరం భీం మరియు అల్లూరి సీతారామరాజు టీజర్ లకు భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఇక అలాగే షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో రాజమౌళి బాలీవుడ్ నుంచి ఆలియా భట్ ను అలాగే హాలీవుడ్ నుంచి ఒలీవియా ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇపుడు వీరితో పాటు ఓ టాలెంటెడ్ హీరోయిన్ కూడా కనిపిస్తుంది అని టాక్ వినిపిస్తుంది. ఆమెనే ఐశ్వర్య రాజేష్. తెలుగు మరియు కోలీవుడ్ లో తన టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ హీరోయిన్ ను తారక్ కు మరో లీడ్ గా జక్కన అనుకుంటున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.