సెట్స్ లో ఆ నలుగురు .. వీళ్లు అందరికీ స్ఫూర్తి కావాలి

0

కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూసివేశారు. షూటింగ్ లు ఆపేసిన విషయం తెలిసిందే. గత ఆరు నెలలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కోవిడ్ విస్తరిస్తున్నా అయితే క్రమ క్రమంగా కేంద్రం ఆన్ లాక్ ప్రక్రియను వేగవంతం చేసింది. కీలక రంగాలని మళ్లీ యాక్టీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలని అనుసరించి సినిమా షూటింగ్ లు కూడా చేసుకోవచ్చని ప్రకటించడంతో బాలీవుడ్ లో ఇప్పటికే భారీ చిత్రాల షూటింగ్స్ మొదలయ్యాయి.

తాజాగా తెలుగులోనూ షూటింగ్ సందడి మొదలైంది. అయితే కొంత షూటింగ్ జరిగిన తరువాత రెండు టీమ్ లకు కరోనా సోకడంతో మధ్యలోనే ఆపేశారు. అందులో మెగా డాటర్ సుష్మిత కొణిదెల నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న వెబ్ సిరీస్ `షూట్ ఔట్ ఎట్ ఆలేర్`. సుష్మిత తన భర్తతో కలిసి ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తోంది. `ఓయ్` ఫేమ్ ఆనంద్ రంగ దర్శకత్వం వహిస్తున్నారు. జీ5లో ఈ వెబ్ సిరీస్ ని రిలీజ్ చేయబోతున్నారు. కో-డైరెక్టర్ కి కరోనా సోకడంతో షూటింగ్ ని నిలిపివేశారు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న `మేజర్` టీమ్ కూడా ఇదే సమస్య కారణంగా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది.

దీంతో స్టార్ హీరోలు ఒక్కసారిగా భయపడ్డారు. వీళ్లలో నాగార్జున ఒక్కరే వైల్డ్ డాగ్ షూటింగ్ సహా బిగ్ బాస్ 4 షూటింగ్ ని ప్రారంభించడం ఆసక్తికరం. ఆయన డేర్ గట్స్ కి ఫిదా అయిపోతున్నారంతా. ఇక క్రిష్ జాగర్లమూడి మెగా మేనల్లుడు సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తో ఓ చిత్రాన్ని ప్రారంభించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. వికారాబాద్ లో షూటింగ్ చేశారు. సంపత్ నంది సమర్పణలో రూపొందుతున్న `బ్లాక్ రోజ్`వెబ్ సిరీస్ కూడా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో బాలీవుడ్ హాట్ గర్ల్ ఊర్వశీ రౌతేలా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ రెండు టీమ్ లకి కూడా కరోనా భయం వెంటాడుతోంది. ఇక తేజ కూడా వెబ్ సిరీస్ మొదలుపెట్టాడు. మధ్యలోనే కరోనా సోకడంతో ఆపేశాడు. దీంతో మిగతా వాళ్లలో కరోనా భయం వెంటాడుతోందట. జాగ్రత్తలు పాటించకపోతే కోవిడ్ బారిన పడటం ఖాయంగా కనిపిస్తోంది. దీని నుంచి క్రిష్ సంపత్ నంది టీమ్ బయటపడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. భయం వెంటాడినే డేరింగ్ గానే షూటింగ్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి మరి.