ర్యాప్ సాంగ్ తో అదరగొట్టిన రకుల్…!

0

దక్షిణాది అగ్రకథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలతో ఎంత బిజీగా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా పోస్టులు పెట్టడంతో పాటు సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఇంట్లో తాను చేస్తున్న పనులు.. వర్క్ఔట్స్ గురించి తెలియజేస్తూ వీడియోలు షేర్ చేస్తుంది. కరోనా లాక్ డౌన్ లో రకరకాల ఛాలెంజులు అంటూ రకుల్ సోషల్ మీడియాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ”కరే ని కర్దా రాప్ ఛాలెంజ్” లో పార్టిసిపేట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ”#CareNiKardaRapChallenge కు నన్ను నామినేట్ చేసినందుకు.. వీడియోను రూపొందించడానికి నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ అర్జున్ కపూర్. మీరు నాకు బాగా సహాయం చేసారు.. నేను మీకు భిన్నంగా ఫుల్ ర్యాప్ ముగించాను!” అని పోస్ట్ పెట్టింది రకుల్. ఈ ఛాలెంజ్ కు నటుడు టీవీ హోస్ట్ అపరశక్తి ఖురానా ని రకుల్ నామినేట్ చేసింది.

కాగా యోయో హనీ సింగ్ ”ఛలాంగ్” సినిమా కోసం ‘కరే ని కర్దా’ ర్యాప్ పాడిన నేపథ్యంలో ‘కరే ని కర్దా రాప్ ఛాలెంజ్’ క్రియేట్ చేసారు. దీంట్లో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు భాగస్వామ్యులు అయ్యారు. నవంబరు 13న ‘ఛలాంగ్’ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ ఛాలెంజ్ తో సినిమాని ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మోహతా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో రాజ్ కుమార్ రావ్ – నుస్రత్ బరుచా హీరో హీరోయిన్లుగా నటించారు. చిత్ర యూనిట్ క్రియేట్ చేసిన ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ర్యాప్ పాడి.. ఈ ఛాలెంజ్ కి తన నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా నటించనున్న రకుల్ ప్రీత్ సింగ్ ని నామినేట్ చేసాడు. ఈ సవాలుకు అంగీకరించిన రకుల్.. తనదైన శైలిలో ర్యాప్ సాంగ్ పాడింది. రకుల్ ఈ ర్యాప్ ని ఆలపించిన విధానం.. దీనికి ఆమె ఇచ్చిన ఎక్సప్రెషన్స్ నెటిజన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రకుల్ ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఈ ర్యాప్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.