Templates by BIGtheme NET
Home >> Cinema News >> RRR సీతా రామరాజు పౌరుషం చూశారా?

RRR సీతా రామరాజు పౌరుషం చూశారా?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `ఆర్.ఆర్.ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్- కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పునః ప్రారంభం కాబోతోంది.

ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఓ ఫొటో అభిమానుల్ని అమితంగా ఆకర్షిస్తోంది. సూటిగా సూదంటు చూపులతో చరణ్ ఫెరోషియస్ గా కనిపిస్తున్నారు. ఆయన లుక్ యమ కిర్రాక్ అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ రేంజ్ లో చరణ్ కనిపించడానికి చాలానే శ్రమించినట్టు తెలుస్తోంది. కెరీర్ ప్రారంభం నుంచి రామ్ చరణ్ లుక్ పై చాలానే విమర్శలు వినిపించాయి. సర్జరీలు అంటూ పుకార్లు కూడా పుట్టించారు.

అయితే `ధృవ` నుంచి రామ్ చరణ్ మేకోవర్ లో స్పష్టమైన మార్పులు కనిపించడం మొదలైంది. ఈ మూవీలో చరణ్ మ్యాన్లీగా మరింతస్టైలిష్ మేకోవర్ తో కనిపించాడు. ఆ తరువాత వచ్చిన `రంగస్థలం`లోనూ అదే పంథాను కొనసాగించాడు. ఇక తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` కోసం చరణ్ లుక్ లో మరింత స్పష్టత.. పరిణతి కనిపిస్తున్నాయి. బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ లో చరణ్ లుక్ ఎంత బాగా కనిపించాడో తెలిసిందే. ఆయన లుక్ రోమాంచితంగా వుండేలా డిజైన్ చేసిన తీరు ఫ్యాన్స్ కి పండగలా మారేలా కనిపిస్తోంది. బుధవారం రాత్రి చరణ్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరణ్ లుక్ పై అభిమానుల్లో చర్చ మొదలైంది. దీనికి `బీ ది బెస్ట్ పాజిబుల్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్` అని క్యాప్షన్ ఇవ్వడంతో ఫ్యాన్స్ వెండితెరపై ఇక రచ్చే అని పండగ చేసుకుంటున్నారు. అక్టోబర్ తో ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ ముగించి ఆచార్య షూటింగ్ లో పాల్గొనేందుకు చరణ్ సన్నాహకాల్లో ఉన్నారని తాజాగా వెల్లడైంది. నవంబర్ నుంచి ఆయన కొరటాలతో కలవనున్నారట.