చరణ్ ఫ్యాన్స్ మిలియన్ పై కన్నేసినట్లున్నారు

0

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఇటీవల రామరాజు ఫర్ భీమ్ వీడియో వచ్చింది. ఎన్టీఆర్ లుక్ ను రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో చూపించారు. ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందో వీడియోలో చూపించారు. చరణ్ వాయిస్ ఓవర్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. విజువల్స్ మరియు ఎన్టీఆర్ బాడీ ఇలా అన్నింటి మేళ్లవింపుతో రామరాజు ఫర్ భీమ్ వీడియోకు అద్బుతమైన స్పందన దక్కింది. తక్కువ సమయంలోనే మిలియన్ లైక్స్ ను యూట్యూబ్ లో దక్కించుకుంది. భారీ వ్యూస్ ను కూడా తెలుగు వీడియో రాబట్టింది.

ఎన్టీఆర్ వీడియో మిలియన్ లైక్స్ దక్కించుకుని సౌత్ లోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును చరణ్ ఫ్యాన్స్ కూడా సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు అయిదు నెలల క్రితం విడుదల అయిన భీమ్ ఫర్ రామరాజు వీడియో కు ఏడు లక్షల లైక్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ వీడియో లైక్స్ పెరుగుతున్నాయి.

మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ వీడియో లైక్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ దక్కించుకున్న మిలియన్ లైక్స్ రికార్డును కాస్త ఆలస్యంగా అయినా చరణ్ కు కట్టబెట్టాలని మెగా ఫ్యాన్స్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మూడు నాలుగు రోజుల గ్యాప్ లో లక్ష లైక్స్ వచ్చాయి. మరో రెండు లక్షల లైక్స్ వస్తే మిలియన్ మార్క్ ను చరణ్ వీడియో కూడా అందుకుంటుంది. వారి పట్టుదల చూస్తుంటే ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే ఆ వీడియో కూడా మిలియన్ లైక్స్ ను చేరే అవకాశం కనిపిస్తుంది.