Templates by BIGtheme NET
Home >> Cinema News >> స్త్రీని గౌరవించని చోట పూజ గదిలో `దేవత` దేనికి?

స్త్రీని గౌరవించని చోట పూజ గదిలో `దేవత` దేనికి?


స్త్రీ ఆకాశంలో సగం. పురుషుడిలో సగం స్త్రీ. అర్థనారీశ్వరుడు అనేది అందుకే. కానీ సంఘంలో స్త్రీలపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో నిత్యం చూస్తున్నదే. స్త్రీలకు భారతీయ సమాజంలో గౌరవం ఎంతో ప్రత్యక్ష సాక్ష్యాలున్నాయి. గాంధీజీ ప్రవచించిన ఆడదానికి అర్థరాత్రి స్వాతంత్య్రం సంపూర్ణంగా రాలేదనే చెప్పాలి.

అందుకేనేమో.. ఉపాసన రామ్ చరణ్ అంతటి సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. అసలు స్త్రీకి గౌరవం దక్కని చోట పూజ గది నుంచి దేవతను తొలగించండి అంటూ సీరియస్ అయ్యారు. అలాంటి వాళ్లంతా దయచేసి పూజ గది నుండి దేవిని తొలగించండి!! అంటూ ఉపాసన కాస్త సీరియస్ సందేశం ఇవ్వడం యువతరంలో చర్చకు వచ్చింది.

దేశవ్యాప్తంగా రోజూ మహిళలపై అసంఖ్యాక దారుణాలు జరుగుతున్నాయి. దసరా శుభ సందర్భంగా భారతీయులు దుర్గాదేవిని ఆరాధించారు కానీ స్త్రీలను గౌరవిస్తున్నారా.. గౌరవిస్తే ఎంతగా గౌరవిస్తున్నారు? అన్నదానిని ఉపాసన ప్రశ్నించారు. “మీరు దేశం విజయవంతం కావాలంటే మహిళలు కూడా విజయవంతం కావాలి. మీ ఇంటిలోని మహిళలను ఎలా గౌరవించాలో మీకు తెలియకపోతే దయచేసి మీ పూజ గది నుండి దేవిని తొలగించండి. పురుషులు రాముడిలాగా ఉండలేనప్పుడు…. మహిళలు సీతగా ఉండాలని వారు ఎందుకు ఆశిస్తారు? ప్రతి స్త్రీని దేవతలా పూజించాలి. స్త్రీల జీవితాలను వేరే లెన్స్ తో చూడండి“ అని ఉపసన బలమైన సందేశం ఇచ్చారు. పురుషులందరికీ ఒకరకంగా చీవాట్లతో కూడుకున్న విజ్ఞప్తిని చేశారనే చెప్పాలి.