Templates by BIGtheme NET
Home >> Cinema News >> డ్రగ్స్ లో దొరికిన రియాకు ఎన్నేళ్ల జైలు?

డ్రగ్స్ లో దొరికిన రియాకు ఎన్నేళ్ల జైలు?


సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రియా చక్రవర్తిని ఎన్.సి.బి బృందాలు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రియాను విచారించిన నార్కోటిక్స్ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే గాక బెయిల్ రాకుండా నిర్భంధించారు. డ్రగ్స్ లో రియా ప్రమేయం.. అమ్మకాలు కొనుగోళ్లు పెడ్లర్లతో సంబంధాలు అన్నిటిపైనా ఆరాలు తీసి కేసులు బనాయించారు. ఇందులో సుశాంత్ పై కుట్ర కోణం కేసు కూడా ఉందని తెలుస్తోంది.

ఎన్.సి.బి ఉచ్చులోంచి బయటపడడం అన్నది అసంభవం అన్నంత బలమైన కేసులు ఇవని చెబుతున్నారు. అయితే ఈ కేసులో రియాకు ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది? అన్న దానిపై ఓ నిపుణుడు ఇచ్చిన విశ్లేషణ ఇలా ఉంది.

డ్రగ్స్ కొనడం.. వినియోగించడం.. ఎగుమతి దిగుమతి లేదా అమ్మకాలు సాగించడం .. రాష్ట్రాలకు సరఫరా చేయడం వంటివి నిషేధం. కానీ రియా ఈ తప్పులన్నీ చేసి దొరికిపోయింది. తప్పులన్నిటినీ స్వయంగా అంగీకరించింది. దీంతో నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్ (పదార్థాలు) యాక్ట్ (ఎన్డీపీఎస్) యాక్ట్ 1985 ప్రకారం సెక్షన్ 89 (సీ).. 20(b)- 27(a)- 28- 29 కింద కేసులు బుక్ చేశారు. డ్రగ్స్ అక్రమ నిల్వ -సరఫరా- వినియోగంపై సెక్షన్ 8 (సీ)…. అక్రమ రవాణా.. రాష్టాల మధ్య సరఫరా.. జరిమానా అంశాలపై 20 (బీ).. నార్కోటిక్ డ్రగ్స్ … సైకోట్రాపిక్ పదార్థం వినియోగం కింద 27 (a) కేసు.. క్రిమినల్ కుట్ర.. ఆత్మహత్యకు ప్రేరణ అంశాలపై 28- 29 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ప్రముఖ లాయర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్కో సెక్షన్ కి ఒక్కో శిక్ష ఉంటుంది. సెక్షన్ 8 సీ కింద 10 ఏళ్ల జైలు ఉంటుంది. 2 లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఇతర సెక్షన్ల లో 1 -10 ఏళ్లు శిక్ష- 20కె- 2 లక్షల లోపు జరిమానా విధిస్తారని తెలుస్తోంది. ఈ కేసులో దొరికిపోయిన రియా సహచరులకు తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయని చెబుతున్నారు.