ఆ 20 కేజీలు తగ్గడం వెనక కఠోర శ్రమ తపన

0

టైముకి జిమ్ కి వెళ్లి కఠోరంగా శ్రమించి ఉన్న బరువును తగ్గించుకోవాలంటే ఎంతో పట్టుదల కావాలి. దీనికోసం శారీకంగా శ్రమిస్తే సరిపోదు.. మానసికంగా సంసిద్ధత కావాలి. పైగా టైమ్ మెయింటెనెన్స్ ఫుడ్ మెయింటెనెన్స్ ధ్యానం ఇలా చాలా కావాలి.

అంత కఠోరంగా శ్రమించకపోతే .. నిజానికి కేవలం నాలుగైదు నెలల లాక్ డౌన్ సమయంలో ఏకంగా 20 కేజీల బరువు తగ్గడం సాధ్యమేనా? ఇదే ప్రశ్న నటి విద్యుల్లేఖను అడిగితే .. ఎంతో ఉద్వేగానికి లోనైంది. దీనికోసం మానసికంగా ఎంతగా ప్రిపేరైందో చెప్పుకొచ్చింది. “20 కేజీలు పైగా తగ్గానంటే దానివెనక కఠోర శ్రమ.. కన్నీరు ఉన్నాయి. ఈ ఫోటోలో ఎడమవైపు ఉన్నది చూస్తే అలా ఉండకూడదని అనుకున్నా.

దీనివెనక పట్టుదలకు కారణమేమిటో చెప్పి ఆవేదనను వ్యక్తం చేసింది. ఓ ఆడియోకి వెళ్లినప్పుడు ఉన్న డ్రెస్ లలో ఏదీ చాలలేదు. దాంతో లెగ్గిన్ వేసుకుని షేమ్ ని దాచుకోవడానికి కోట్ వేసుకున్నా. ఆరోజు నాపై నాకే కోపం వచ్చి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నా“ అని తెలిపింది. మనకోసం మనం ఏదైనా చేయాలనుకుంటే అది సాధ్యమేనని విద్యుల్లేఖ అంది.