వామ్మోవ్! కాస్ట్ లీ ప్రేమగువ్వలు.. జుహూ అపార్ట్ మెంట్ అద్దె ఎంతంటే?

0

ఆ అందాల కథానాయిక ఇటీవలే ఓ వివాదంలో ఎరక్కపోయి ఇరుక్కుపోయింది. ఈ గొడవలో ఇరికించిన మరో కథానాయిక భేషరతుగా క్షమాపణలు కూడా చెప్పింది. ఇప్పటికీ ఈ గొడవ కోర్టుల పరిధిలో రాద్ధాంతమవుతూనే ఉంది. ఇదిలా ఉండగానే సదరు కథానాయిక ఓ యంగ్ హీరోతో సహజీవనం చేయడంపైనా ఆసక్తికర చర్చ మొదలైంది. అన్నట్టు ఆ కాంట్రవర్శీ హీరోయిన్ ఎవరు? ఆ ప్రేమగువ్వలు ఎవరై ఉంటారు? అంటారా?

ఈ ఎపిసోడ్ లో కాంట్రవర్శీలో వినిపించిన పేరు రిచా చద్దా. తన లవర్ పేరు అలీ ఫజల్. అతడు 6ప్యాక్ కండరగండడిగా ఇప్పటికే పాపులర్. అయితే ఈ ప్రేమజంట ఇటీవల జుహులో ఒక బంగ్లాను అద్దెకు తీసుకున్నారు. ముంబైలోని అత్యంత అనుకూలమైన ప్రదేశాలలో ఉన్న ఈ బంగ్లాలో నెలకు భారీగా అద్దె చెల్లించాల్సి ఉంటుందట.

ఇంతకీ ఎంత చెల్లిస్తున్నారు? అంటే… జుహుకు చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ 2020 సెప్టెంబర్ 30 న ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 15 రోజుల క్రితం బంగ్లాను వెతికి అడ్వాన్స్ ఇచ్చారు. జుహు అంటేనే బాలీవుడ్ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు నివశిస్తుండే ఏరియా. అక్కడ ఒక ఉన్నతస్థాయి సమాజంలో బంగ్లా నంబర్ 4 ను అద్దెకు తీసుకున్నారు. వారు 36 నెలల కాలానికి బంగ్లాను అద్దెకు తీసుకున్నారట. అంటే మూడు సంవత్సరాలకు అన్నమాట. మొదటి సంవత్సరానికి అద్దె నెలకు రూ .3 లక్షలు.. రెండవ సంవత్సరానికి నెలకు రూ .3.15 లక్షలు …. చివరి సంవత్సరానికి నెలకు రూ .3.30 లక్షలు చెల్లించాలనేది ఒప్పందం. అద్దెకు తీసుకున్న బంగ్లా కోసం రూ .10 లక్షల డిపాజిట్ చెల్లించారట.

ఇక ఇక్కడ అద్దెకు తీసుకున్నవారిలో హృతిక్ కూడా ఉన్నాడు. జూన్ లో హృతిక్ రోషన్ జుహులో ఒక అపార్ట్మెంట్ నిఅద్దెకు తీసుకున్నాడు. 3928 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ కు హృతిక్ నెలకు రూ .8.25 లక్షల అద్దె చెల్లిస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో వరుణ్ ధావన్ తల్లిదండ్రులు కరుణ -డేవిడ్ దంపతులు కూఆ జుహులోని కొన్ని దుకాణాలను అద్దెకు తీసుకున్నారట. నెలకు 3 లక్షలు పైగా అద్దె అంటే ఆషామాషీనా? అసలే సినిమా షూటింగుల్లేవ్ అంటారా? అయినా ఫేజ్ 3 కపుల్ కి ఇదేమీ పెద్ద మొత్తమేమీ కాదు. సినిమా ఆఫీస్ అద్దెలా ఇంటి అద్దె చెల్లిస్తున్న ప్రేమ జంట వరుస కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నవారే కావడంతో సంపాదనకు కొదవేమీ లేదు సుమీ.