చలికి వణుకుతూ నైట్ టైమ్ షూటింగ్ చేస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్..!

0

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ”ఆర్.ఆర్.ఆర్”. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తారక్ – చరణ్ ఇంట్రో వీడియోలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కరోనా నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ను షూట్ చేస్తున్నారు. తాజాగా ఆర్.ఆర్.ఆర్ టీమ్ అర్థరాత్రి షూటింగ్ పరిస్థితులు ఎలా ఉన్నాయో వెల్లడిస్తూ ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది.

ఆర్.ఆర్.ఆర్ టీం ఓ వీడియో ట్విట్టర్ షేర్ చేస్తూ ‘సెట్ హీటర్స్ లేకుండా ఎవరూ ఈ చల్లని గాలుల నుంచి తప్పించుకోలేరు’ అని పేర్కొంది. ఈ వీడియోలో యూనిట్ సభ్యులు మొత్తం చలిలో వణుకుతూ షూట్ లో పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది. రాజమౌళి – ఎన్టీఆర్ – కెమెరామెన్ సెంథిల్ కుమార్.. ఇలా అందరూ సెట్ లో ఏర్పాటు చేసిన హీటర్స్ దగ్గర చలి కాచుకుంటున్నారు. చలి కాలం.. అందులోనూ నైట్ టైమ్ షూట్స్ అంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా షూటింగ్ కంప్లీట్ చేయాలని దృఢ నిశ్చయంతో టీమ్ పని చేస్తున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీలో అజయ్ దేవగన్ – శ్రియా – సముద్రఖని – అలియా భట్ – ఒలీవియా మోరిస్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.